News
News
X

IPL 2022: Ajinkya Rahaneలో ఎందుకింత కసి? మెక్‌ కలమ్‌ నుంచి వచ్చిన మెసేజ్‌ ఏంటి?

Ajinkya Rahane: CSK నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) చూపించిన తెగువ అందరికీ నచ్చింది. క్రీజులో ఉన్నంత సేపు అతడితో ఏదో కసి కనిపించింది.

FOLLOW US: 

 KKR batter ajinkya rahane shines in csk match: ఐపీఎల్‌ 2022 సీజన్‌ (IPL 2022) తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం అందుకుంది. ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Super kings)  నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) చూపించిన తెగువ అందరికీ నచ్చింది. క్రీజులో ఉన్నంత సేపు అతడితో ఏదో కసి కనిపించింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి!

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (50 నాటౌట్: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో అజింక్య రహానే (44: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

చాలామంది అజింక్య రహానెను టెస్టు బ్యాటర్‌గా ముద్రవేస్తారు. అతడి బ్యాటింగ్‌లో దూకుడు ఉండదని భావిస్తారు. నిజానికి అతడికి దూకుడైన మనస్తత్వం! అది అతడి బాడీ లాంగ్వేజ్‌లో కనిపించదు. ఆడే షాట్లలో, పోరాడే మనస్తత్వంలో ఉంటుంది. ఈ సీజన్‌కు ముందు అతడు టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయాడు. కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తీసుకోవడమే లేదు. ఇక ఈ సీజన్‌ వేలానికి ముందు అతడిని తీసుకోవడానికి ఎవరూ మొగ్గు చూపలేదు. కనీస ధరకు కోల్‌కతా దక్కించుకుంది.

ఈ సీజన్లో అజింక్య రహానెకు కలిసొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మొదటిది అతడు ముంబయి నగరానికి చెందినవాడు. రంజీల్లో ముంబయికే ఆడతాడు. ఇక్కడి పరిస్థితులుపై పూర్తి అవగాహన ఉంది. రెండు వాంఖడే పిచ్‌ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో అతడికి బాగా తెలుసు. రెండో బ్యాటింగ్‌లో డ్యూ ఫ్యాక్టర్‌ ఉంటుందన్న సంగతి బాగా ఎరుకే. ఇక మూడోది టీ20 లేదా వన్డేల్లో అతడు ఓపెనింగ్‌ను ఇష్టపడతాడు. ఓపెనర్‌గా అతడికి బాగానే రికార్డులు ఉన్నాయి. ఇవన్నిటినీ మించి దూకుడుగా ఆడాలని కేకేఆర్‌ కోచ్‌ మెక్‌కలమ్‌ అందరికీ మెసేజ్‌ ఇచ్చాడు. పైగా తనను తాను నిరూపించుకోవాలన్న కసి ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు అన్ని అవకాశాలు కలిసి రావడంతో రహానె బాగా ఉపయోగించుకున్నాడు. కసిగా పరుగులు చేశాడు. బౌండరీలు బాదాడు. ఈ సీజనంతా ముంబయి, పుణెలోనే మ్యాచులు జరుగుతాయి కాబట్టి అతడి బ్యాటు నుంచి మరిన్ని మెరుపుల్ని ఆశించొచ్చు.

Published at : 27 Mar 2022 12:57 PM (IST) Tags: IPL CSK ajinkya rahane IPL 2022 Indian Premier League KKR CSK vs KKR CSK vs KKR Live IPL 2022 Schedule IPL 2022 news ipl season 15 IPL 2022 Live Ajinkya Rahane batting

సంబంధిత కథనాలు

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

BCCI over IPL Team Owners: ఐపీఎల్‌ ఓనర్లకు భయపడుతున్న బీసీసీఐ! ఎందుకంటే?

Google Pixel 6A Sale: గూగుల్ పిక్సెల్ 6ఏ సేల్ ప్రారంభం - ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్!

Google Pixel 6A Sale: గూగుల్ పిక్సెల్ 6ఏ సేల్ ప్రారంభం - ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్!

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!