By: ABP Desam | Updated at : 06 May 2022 07:11 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. (Image Credits: BCCI/IPL)
ఐపీఎల్ 2022 సీజన్‌లో 51వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. బ్రబౌర్న్ మైదానం (Brabourne) వేదికగా ఈ మ్యాచ్ జరుపుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టేబుల్ టాపర్స్ అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌లో ఫామ్ లేమి కనిపిస్తోంది. ఆఖర్లో నిలిచిన ముంబయి మరిన్ని విజయాలు సాధించి పరువు నిలుపుకోవాలన్న తాపత్రయంతో ఉంది.
గుజరాత్ టాప్‌లో, ముంబై డౌన్‌లో...
ఈ సీజన్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అంచనాలను అధిగమించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆడిన 10 మ్యాచుల్లో 8 గెలిచి 2 మాత్రమే ఓడింది. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ముంబయి ఇండియన్స్ అయితే తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే వరుసగా ఎనిమిది ఓడిపోయింది. రీసెంటుగా తన మొదటి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టింది. ఇక ఆ జట్టు ఆడేది ఐదు మ్యాచులే. అన్నీ ఆడినా ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపుగా కష్టం. వీలైనంత వరకు అందరూ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది.
గుజరాత్‌కు వీరే కీలకం
గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందంటే దానికి మిడిలార్డరే కారణం. ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌లను ముగించే ఆటగాళ్లు ఉండటం ప్లస్ పాయింట్. నిజానికి టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని వీక్‌నెస్‌లు కనిపిస్తున్నాయి. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లు వరుసగా విఫలమవుతున్నారు. వీరిద్దరూ రాణించడం గుజరాత్‌కు చాలా ముఖ్యం. వృద్ధిమాన్ సాహా వేగంగా ఆడుతుండటం శుభ పరిణామం. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ త్రయమే ఇప్పటి వరకు బ్యాటింగ్‌లో విజయాలు అందించింది. చివరి మ్యాచ్‌లో వీరిని అడ్డుకుని పంజాబ్ విజయం సాధించింది. గాయపడిన సాయి కిషోర్ స్థానంలో అభినవ్ మనోహర్ లేదా విజయ్ శంకర్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో టైటాన్స్‌కు తిరుగులేదు.
సూర్యకుమార్ ఒక్కడే
ముంబై ఇండియన్స్ ఓటములకు ప్రధాన కారణం బౌలింగ్‌లోని లోపాలే! జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా నిలిచే బౌలర్ ఎవ్వరూ లేరు. దాంతో ప్రత్యర్థులు తనను గౌరవిస్తూ మిగతా వాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో కనీసం భారీగా పరుగులు పరుగులు ఇచ్చారు. ముంబై ఓటములకు అవే కారణంగా మారాయి. బౌలింగ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణించాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నారు. మిగతా ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంది.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్
ముంబయి ఇండియన్స్ తుదిజట్టు
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, రిలే మెరిడీత్
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు
IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ పొగడ్త
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!