GT vs PBKS Preview: తెవాతియా కొట్టిన ఆ 2 సిక్సర్లు గుర్తుచేసుకొంటేనే పంజాబ్‌కు వణుకు!
GT vs PBKS Preview: ఐపీఎల్ 2022లో 48వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
GT vs PBKS Preview: ఐపీఎల్ 2022లో 48వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియం ఇందుకు వేదిక. టేబుల్ టాపర్స్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఖరీదైన ఆటగాళ్లే ఉన్నా పంజాబ్ కింగ్స్‌కు ఓటములే ఎదురవుతున్నాయి. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?
2 పాయింట్లు వస్తే ప్లేఆఫ్స్
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఎదురే లేకుండా ఉంది. ఆడిన 9 మ్యాచుల్లోనే 8 గెలిచి 16 పాయింట్లతో నంబర్‌వన్ పొజిషన్లో ఉంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 9 మ్యాచుల్లో 4 గెలిచి 5 ఓడింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ చేరుకోవాలంటే ఇకపై వరుస విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వీరిద్దరూ తలపడ్డ మొదటి మ్యాచులో టైటాన్స్ చివరి బంతికి గెలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా రాహుల్ తెవాతియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి పంజాబ్‌కు గుండెకోత మిగిల్చాడు.
మూమెంటమే గుజరాత్ బలం
ఇప్పుడున్న మూమెంటమ్‌లో గుజరాత్‌కు ఉన్న వీక్‌నెస్‌లు బయటపడటం లేదు! వాస్తవంగా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో లేడు. వన్‌డౌన్‌లో ఎవరొస్తారో తెలియడం లేదు. అయితే రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ విలువైన ఇన్నింగ్సులు ఆడుతూ గెలిపిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ గుజరాత్‌కు ఒక ఇరుసులా పనిచేస్తున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అతడి స్థానంలో ఒక అదనపు బౌలర్‌ను తీసుకోవాల్సి రావడంతో ఒక బ్యాటర్ షార్ట్ అవుతున్నాడు. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ కన్ఫామ్ అయితే బ్యాటింగ్లో చాలా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.
పంజాబ్‌కు అన్నీ ఉన్నా!
పంజాబ్ కింగ్స్ (PBKS) వేలంలో ఎంతోమంది పవర్‌ఫుల్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. యాజమాన్యం కోరుకున్నది డెలివరీ చేయడంలో వారు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్కరూ నిలకడగా ఆడటం లేదు. మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ తరహాలో ఒక్కరూ బాధ్యతగా చివరి వరకు ఉండే ప్రయత్నం చేయడం లేదు. ధావన్, మయాంక్, రాజపక్స, బెయిర్ స్టో, లివింగ్‌స్టన్‌లో ఒక్కరూ వరుసగా 2-3 మ్యాచుల్లో పరుగులు చేయలేదు. బౌలింగ్ వరకు పంజాబ్ బాగుంది. సందీప్ శర్మ, అర్షదీప్, రబాడా, రిషి ధావన్ పేస్ విభాగం చూసుకుంటున్నారు. రాహుల్ చాహర్ స్పిన్ బాగుంది. పంజాబ్ గెలవాలంటే మాత్రం కష్టపడాల్సింది చాలా ఉంది.
GT vs PBKS Probable XI
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, యశ్ దయాల్/ ప్రదీప్ సంగ్వాన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ
It's round 2 of one of the greatest IPL finishes 🔥
— Gujarat Titans (@gujarat_titans) May 3, 2022
Summing up today's challenge with the Titans!@atherenergy#GTvPBKS #AavaDe #SeasonOfFirsts pic.twitter.com/Vym80ENjJj