IPL 8 Records: ఐపీఎల్ లో 8 నంబర్‌తో లింక్ ఉన్న రికార్డ్‌లు ఇవే
IPL 8 Records: కొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌కు సంబంధించి 8 నంబర్ పేరుమీద ఉన్న టాప్-10 రికార్డ్‌లు ఓ సారి పరిశీలిద్దాం.
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మొత్తం ఈ లీగ్ కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో 2024 సీజన్ ఆరంభం కానుంది. ప్రతీ ఏడాది ఈ లీగ్‌లో రికార్డ్‌లు బద్ధలవుతూనే ఉన్నాయి. కొత్త ఐపీయల్ సీజన్‌కి ఇంకా 8 రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో ఐపీఎల్ కు సంబంధించి 8 నంబర్ పేరుమీద ఉన్న టాప్-10 రికార్డ్‌లు ఓ సారి పరిశీలిద్దాం.
చక్‌దే ఇండియా
ఐపీఎల్ లో ఇండియన్ టీమ్ కెప్టెన్లహవా నడుస్తుంది. మెత్తం 8 మంది టీమిండియా ఆటగాళ్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం పది టీమ్‌లకు గానూ 8 టీమ్ లను మనవాళ్లే నడిపిస్తున్నారు. చెన్నై మహేంద్రసింగ్ ధోనీ, ముంబై హార్ధిక్‌పాండ్యా, కోల్‌కతా శ్రేయస్ అయ్యర్, లక్నో రాహుల్, గుజరాత్ శుభ్‌మన్ గిల్, పంజాబ్‌కింగ్స్ శిఖర్‌ధావన్ నాయకత్వంలో నడవనుండగా... రాజస్థాన్ ని సంజూ శాంసన్, ఢిల్లీ ని రిషబ్‌పంత్ నడపనున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఫాప్ డుప్లెసిస్ కెప్టెన్ కాగా, సన్‌రైజర్స్ హైద్రాబాద్ కి పాట్ కమిన్స్ విదేశీ కెప్టెన్లుగా ఉన్నారు.
వార్న్ మాయ
రాజస్థాన్‌రాయల్స్ ను సమర్ధంగా నడిపించి ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి టైటిల్ విజేతగా నిలపడంలో షేన్‌వార్న్‌ది చాలా ముఖ్యమైన పాత్ర. ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించిన వారిలో 8 స్థానంలో ఉన్నాడు షేన్ వార్న్. 2008లో మొట్టమొదటి ఐపీఎల్ టోర్నీలో అసలు ఎవరి అంచనాలకు అందని విధంగా జట్టును నడిపించిన వార్న్ మొత్తం 55 మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జట్టును 34 మ్యాచ్‌ల్లో విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుత రాజస్థాన్ జట్టు దివంగత షేన్‌వార్న్ కి ఈసారి టైటిల్ గెలిచి నివాళి అర్పించాలని పట్టుదలగా ఉంది.
డకౌట్ పాండే
మనీష్ పాండే.. ఐపీఎల్లో ఎక్కువ ధరకు ఫ్రాంచైజీలు సొంతం చేసుకొనే ఈ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ లోఎక్కువ సార్లు డకౌట్ అయ్యిన ఎనిమిదవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో 158 ఇన్నింగ్స్‌లు ఆడిన పాండే 14 సార్లు డకౌటయ్యి నిరాశపరిచాడు. కానీ నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టే పాండే 2,3 బంతుల వ్యవధిలోనే వికెట్ చేజార్చుకోవడం, సహజంగా ఫస్ట్‌డౌన్,సెకండ్‌డౌన్ వచ్చే మనీష్ ఇలా అవుటవ్వడంతో జట్టు పూర్తి ఆత్మరక్షణలో పడిపోతుంది.
తిప్పేసిన నరైన్
ఐపీఎల్ లోఎక్కువ వికెట్లుతీసిన వారిలో సునీల్ నరైన్ ఎనిమిదవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఈ స్పిన్నర్ 162 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు సాధించాడు. 19 పరుగులకే 5 వికెట్లు కూల్చి తన అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. 6.73 సగటుతో బౌలింగ్ చేస్తాడు అంటే బ్యాట్స్‌మెన్ కి నరైన్ బౌలింగ్‌లో పరుగులు చేయడం ఎంతకష్టమో అర్ధంచేసుకోవచ్చు.
జూలు విదిల్చిన సంజూ
ప్రతిభావంత ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూశాంసన్ ఐపీఎల్ అత్యధిక సెంచరీల విభాగంలో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సంజూతర్వాత రాజస్థాన్‌కు మారాడు. 2013లో ఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ 20 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఊతప్ప రికార్డ్
టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో ఎనిమిదవ స్థానంలో
ఉన్నాడు. ఐపీఎల్ లో మొత్తం 250 మ్యాచ్‌లుఆడిన ఊతప్ప 4952 పరుగులు చేశాడు. 2022 లో ఆటనుంచి రిటైరయ్యిన రాబిన్...ఐపీఎల్ లో మొత్తం 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
గిరా గిరా డివిలియర్స్..
ఏబీ డివిలియర్స్... క్రీజులో ఉన్నాడు అంటే భారీ షాట్లతో విరుచుకుపడే ఈ మిస్టర్ 360... ఐపీఎల్ లో ఎక్కువ స్ర్టైక్‌రేట్
కలిగిఉన్న ఆటగాళ్లలో 8వ స్థానంలో ఉన్నాడు. 151.68 స్ర్టైక్‌రేట్ కలిగిఉన్న ఏబీ 170 ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్నాడుఅంటే
ప్రత్యర్ధులకు చుక్కలే. మరి అలాంటి బ్యాట్స్‌మెన్ స్ర్టైక్‌రేట్ అలానే ఉండకపోతే ఎలా మరి. అది రికార్డ్ అందించకపోతే ఎలా మరి.
హైద్రాబాద్ కా విన్నింగ్
గత సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న సన్‌రైజర్స్ హైద్రాబాద్ కి భారీ విజయం దక్కింది. 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌లెవన్ పై గెలుపొందింది సన్‌రైజర్స్. హైద్రాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ని ఢీకొన్న రైజర్స్ 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందారు. మొదట పంజాబ్ ని 143 పరుగులకే నియంత్రించిన హైద్రాబాద్ బ్యాటింగ్ లో త్రిపాఠి చెలరేగడంతో 2 వికెట్లే కోల్పోయి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింంది.
కీపింగ్ మజా... నమన్ ఓజా
నమన్ ఓజా..... ఐపీఎల్ లో వికెట్ కీపింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్నాడు ఓజా. ఐపీఎల్ లో వికెట్‌కీపర్ గా అత్యధిక వికెట్లు పడగొట్టిన కీపర్ జాబితా లో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు నమన్ ఓజా. 111 ఇన్నింగ్స్‌ల్లో 75 డిస్మిసల్స్‌లో తన పాత్ర ఉంది. ఇందులో 60 క్యాచ్ లు, 15 స్టంపింగ్స్ ఉన్నాయి. 2018లో ఐపీఎల్ నుంచి రిటైరైన నమన్ ఓజా ఓ మ్యాచ్‌లో 4 వికెట్లలో పాలు పంచుకోవడం 4 సార్లు ఉంది.
ఆర్సీబీ... ఛేజింగ్
ఐపీఎల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో ఎనిమిదవ స్థానంలో ఉంది... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
2015మే 10న భీకర ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ని చీల్చి చెండాడుతూ 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి
235 పరుగుల స్కోరు సాధించింది. ఇరవై ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11.75 రన్ రేట్ తో 235 పరుగు స్కోరు సాధించింది. తమ సొంత మైదానం వాంఖడేలో బెంగళూరు వికెట్లుతీయడం కోసం ముంబై బైలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. కానీ ఎక్కడా అవకాశం ఇవ్వని బెంగళూరు డివిలియర్స్ సెంచరీతో, కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఈ రికార్డ్ నమోదు చేసింది.