By: ABP Desam | Updated at : 11 May 2023 09:05 PM (IST)
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ( Image Source : PTI )
ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు ఒక్క స్థానం కోల్పోయి మూడో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచాయి. టాప్ 3 జట్ల మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో 116 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్థానంలో, 115 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచకప్ సమయానికి మొదటి మూడు జట్ల మధ్య ర్యాంకింగ్‌లో మార్పు ఉంటుంది.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వార్షిక నవీకరణ తర్వాత ఈ మార్పు వచ్చింది. అంతకు ముందు ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, దాదాపు అదే పాయింట్లతో భారత్ రెండో స్థానంలో, 112 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 5-0తో కైవసం చేసుకుంది. దీని తర్వాత పాకిస్థాన్ వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా అవతరించింది. అయితే ఇప్పుడు తాజా ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు రెండో స్థానానికి చేరుకుంది.
ఐసీసీ తాజా వార్షిక ర్యాంకింగ్‌లో 2020 మే తర్వాత జరిగిన అన్ని సిరీస్‌లు చేర్చారు. 2022 మేకి ముందు జరిగినన అన్ని సిరీస్‌ల వెయిటేజీని 50 శాతంగా, 2022 మే తర్వాత జరిగే సిరీస్‌ల వెయిటేజీని 100 శాతంగా ఉంచారు. ఐసీసీ చేసిన ఈ మార్పు కారణంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య రెండు సిరీస్‌ల ప్రాముఖ్యత తగ్గింది. 2020లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ 0-4 తేడాతో ఓడిపోయింది, ఈ సిరీస్ ర్యాంకింగ్స్‌లో చేరలేదు. 2021లో ఇంగ్లండ్ 3-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ సిరీస్ వెయిటేజీ కూడా 50 శాతానికి పెరిగింది. పాకిస్థాన్ భారత్‌ను దాటి రెండో స్థానానికి చేరడానికి ఇదే కారణం.
ర్యాంకింగ్‌లో ఉన్న ఇతర జట్ల గురించి చెప్పాలంటే, న్యూజిలాండ్ 104 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ 101 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇంగ్లిష్ జట్టు రేటింగ్ 10 పాయింట్లు పడిపోయింది. మరోవైపు గణనీయమైన ఆధిక్యంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 8వ స్థానంలో, శ్రీలంక 9వ స్థానంలో, వెస్టిండీస్ 10వ స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా 6వ స్థానంలో, బంగ్లాదేశ్ 7వ స్థానంలో కొనసాగుతున్నాయి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జట్ల స్థానాలు
1. ఆస్ట్రేలియా (118 పాయింట్లు)
2. పాకిస్తాన్ (116 పాయింట్లు)
3. భారతదేశం (115 పాయింట్లు)
4. న్యూజిలాండ్ (104 పాయింట్లు)
5. ఇంగ్లండ్ (101 పాయింట్లు)
6. దక్షిణాఫ్రికా (101 పాయింట్లు)
7. బంగ్లాదేశ్ (97 పాయింట్లు)
8. ఆఫ్ఘనిస్తాన్ (88 పాయింట్లు)
9. శ్రీలంక (80 పాయింట్లు)
10. వెస్టిండీస్ (72 పాయింట్లు)
And still World No. 1 🌟
— ICC (@ICC) May 11, 2023
Australia retain the top spot in the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after the annual update 🥇
✍: https://t.co/WC3uJQXZvN pic.twitter.com/RKKegnDV85
🇮🇳 🇦🇺
— ICC (@ICC) May 11, 2023
The two giants of the @MRFWorldwide ICC Men’s Team Rankings 💪
Full rankings ➡️ https://t.co/WBGQWBCAB4 pic.twitter.com/eNKUQkj2nI
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !