అన్వేషించండి

IPL MI Hardik Pandya Retention: కెప్టెన్సీ లేక‌పోయినా ముంబైలోనే హార్దిక్ .. రోహిత్ నిర్ణయంతో ఆ ప్లేయ‌ర్ కి కెప్టెన్సీ..

కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగే అవకాశం ఉందని, రోహిత్ శర్మ సలహాతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

Mumbai Indians Plan Major Leadership Transition: ఐపీఎల్ ట్రేడింగ్ రూమర్ల నడుమ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఏడాది పాటు ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీలోనే కొనసాగే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ పదవి నుంచి అతడిని తప్పించినప్పటికీ, సరైన ట్రేడ్ డీల్ కుదరకపోవడంతో ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై జట్టులోనే అతడు కొనసాగేందుకు మార్గం సుగమమైంది. అయితే కెప్టెన్సీలో మాత్రం భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని స‌మాచారం. కొత్త సారథిని ఎంపిక చేసే కీలక చర్చల్లో ఐదుసార్లు ట్రోఫీ గెలిపించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు.

న‌యా కెప్టెన్ అత‌డే..!
ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసం సరికొత్త నాయకత్వంలో ముందుకు వెళ్లాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో, కొత్త నాయకుడి ఎంపికపై తన అమూల్యమైన సలహాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో తెలుగు స్టార్ తిలక్ వర్మ, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో తిలక్ వర్మ వైపే ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతోందని స‌మాచారం.

చ‌ర్చ‌లు జరిగినా, నో డీల్..
హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - ముంబై ఇండియన్స్ మ‌ధ్య‌ సంప్రదింపులు జ‌రిగాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ట్రేడ్ అసెట్ గా కేకేఆర్ ముందుకు తెచ్చినప్పటికీ, వచ్చే ఏడాది అతడి వర్క్‌లోడ్ సమస్యల కారణంగా ముంబై ఆసక్తి చూపలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కొత్త హెడ్ కోచ్‌ను ఖరారు చేసిన తర్వాత వారితో చర్చలు జరిగే అవకాశం ఉందని స‌మాచారం. అయితే ట్రేడింగ్ జరగకపోతే హార్దిక్ ముంబైలోనే సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతాడని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.

స్కై రిటెన్ష‌న్.. 
2026 సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌ను ఐపీఎల్ 2027 కోసం ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనుందని తెలుస్తోంది. ఒక్క సీజన్ వైఫల్యంతో ప్లేయర్లను వదిలేసే సంస్కృతి తమది కాదని, 'వన్ ఫ్యామిలీ' సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామని మేనేజ్‌మెంట్ తెలిపింది. హెడ్ కోచ్ గా మహేల జయవర్ధనే మరో ఏడాది పాటు సేవ‌లందించ‌నున్నాడు. మెగా వేలానికి ముందు చివరి ఏడాది కావడంతో జట్టులో పెను మార్పులు చేయకుండా స్థిరత్వాన్ని కాపాడుకోవాలని ముంబై యోచిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
Mustafizur IPL Return: ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు
ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget