GT Vs DC, IPL 2022 LIVE: అదరగొట్టిన గుజరాత్ బౌలర్లు - 14 పరుగులతో ఢిల్లీపై విజయం
గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేటి సాయంత్రం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌ను విజయంతోనే ప్రారంభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ మూడో స్థానంలోనూ, గుజరాత్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎక్కువ తేడాతో విజయం సాధించిన జట్టుకు మొదటి స్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
20 ఓవర్లలో 157-9కు పరిమితమైన ఢిల్లీ - 14 పరుగులతో గుజరాత్ విజయం
రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 157-9గా ఉంది. గుజరాత్ టైటాన్స్ 14 పరుగులతో విజయం సాధించింది.
కుల్దీప్ యాదవ్ 14(14)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3(5)
రాహుల్ టెవాటియా 2-0-22-0
19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 148-9
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 148-9గా ఉంది.
కుల్దీప్ యాదవ్ 6(9)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2(4)
హార్దిక్ పాండ్యా 4-0-22-1




















