తిలక్ వర్మ ఆటతో సన్‌రైజర్స్‌పై ట్రోలింగ్- సమద్, సమోసాలు ఎందుకంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
సన్ రైజర్స్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఆక్షన్ స్ట్రాటజీ వల్లే ఇలాంటి ఫలితాలంటూ విమర్శలు చేస్తున్నారు. లోకల్ ప్లేయర్స్‌ను తీసుకోవట్లేదంటున్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సన్ రైజర్స్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఆక్షన్ స్ట్రాటజీ వల్లే ఇలాంటి ఫలితాలంటూ విమర్శలు చేస్తున్నారు. లోకల్ ప్లేయర్స్‌ను తీసుకోవట్లేదంటున్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ లాంటివాళ్లను వదిలేసి అబ్దుల్ సమద్ లాంటివాళ్లను కంటిన్యూ చేయడం వెనుక సన్ రైజర్స్ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదని ఫ్యాన్స్ అంటున్నారు.మన ఆరెంజ్ ఆర్మీ... సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ స్ట్రాటజీ గురించి ప్రతి ఏడాదీ ఎన్ని ట్రోల్స్ వస్తాయో తెలిసిందేగా. ప్లేయర్స్ మీద కన్నా సమోసాలు, టీ బిస్కెట్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారని దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటారు.
ఏళ్ల తరబడి మనం సన్ రైజర్స్ జట్టును ఎప్పుడు చూసినా బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ లో తెలుగువాళ్ల సంగతి దేవుడు ఎరుగు.... సరైన ఇండియన్ ప్లేయర్స్ ను ఎప్పుడూ సరిగ్గా పిక్ చేసుకున్న పాపాన పోలేదు. సన్ రైజర్స్ బ్యాటింగ్ గురించి గట్టిగా చెప్పుకుంటే... వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, ఇప్పుడు మార్ క్రమ్, క్లాసెన్, హ్యారీ బ్రూక్... వీళ్లే కదా గుర్తుకు వచ్చేది. సరైన ఇండియన్ బ్యాటర్ ఎప్పుడూ లేడు. ఇప్పుడు నిన్న ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ సందర్భంగా.....మన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ముంబయి తరఫున ఆడుతూ... హైదరాబాద్ జట్టు మీద రెచ్చిపోతే... ఫ్యాన్స్ అందరూ చాలా హర్ట్ అయ్యారు.
ఆక్షన్ కు ముందు అసలు ఏమైనా వర్క్ చేశారా..? ఇలాంటి తెలుగు ప్లేయర్స్ మీద అసలు కన్నేశారా అన్న డౌట్స్ వస్తున్నాయి. నాలుగేళ్లుగా అబ్దుల్ సమద్ ను టీంలోనే ఉంచుతున్నారు. అంతగా ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు కూడా ఎక్కువ కనపడవు. అసలు కోచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్ మెంట్ ఏం ఆలోచిస్తోందీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తిలక్ వర్మ గురించి చెప్పుకుంటే.... ఇన్నింగ్స్ పరిస్థితికి తగ్గట్టుగా తన బ్యాటింగ్ ను మార్చుకోగల అమేజింగ్ ఫ్లెక్సిబిలిటీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒకట్రెండేళ్లల్లో ఇండియా తరఫున ఆడేస్తాడని కూడా అందరూ చెప్తున్నారు. మంగళవారం మ్యాచ్ అయ్యాక ముంబయి ఇండియన్స్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కాస్త ఇన్ డైరెక్ట్ గా అదే మాట చెప్పాడు. సో సన్ రైజర్స్ సంగతి పక్కన పెడితే.... మన తెలుగు కుర్రాడు యంగ్ ఏజ్ లోనే టీమిండియా దాకా వెళ్తే చూడాలని ఉంటుంది కదా మన అందరికీ.