IPL 2024: మెరిసిన పోరెల్, మేక్ గేల్ -రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
Delhi vs Rajasthan: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఢిల్లీ , రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
DC vs RR LIVE Score: ఐపీఎల్(IPL) ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్(RR)తో ఢిల్లీ క్యాపిటల్స్(DC) తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకొని ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బరిలో దిగిన బ్యాటర్లు రాణించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 65 పరుగులతో పోరెల్, 50 పరుగులతో జేక్ ఫ్రెసర్, 41 పరుగులతో స్టబ్స్ రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్ తీయగా, బౌల్ట్, సందీప్, యుజ్వేంద్ర తలో వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ ఇన్నింగ్స్ ఇలా ..
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకొని ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపెనర్లుగా క్రీజులో జేక్ ఫ్రెసర్, అభిషేక్ పోరెల్ దిగారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో ఒక బౌండరీ కొట్టిన ఫ్రెసర్‌కు స్వల్ప గాయం అవ్వడంతో తక్షణం వైద్య సేపలు అందించి తరువాత మళ్ళీ ఆట మొదలుపెట్టారు. ఓపెనర్లు జోరుగా ఆడుతుండగా అవేశ్‌ఖాన్ వేసిన 4వ ఓవర్లో ఫ్రెసర్ బ్యాట్ ఝళిపించాడు. ఒకే ఓవర్ లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే ఫెరెరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ లి చేరాడు. ఫ్రెసర్ తరువాత దిగిన షై హోప్ ఒక్క పరుగుకే రనౌట్ కాగా 9 వ ఓవర్ కి ఢిల్లీ స్కోర్ వంద దాటింది. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అశ్విన్ వేసిన పదో ఓవర్లో ఓ షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్ పరాగ్‌కి చిక్కాడు. అవేశ్‌ఖాన్ వేసిన 11వ ఓవ ర్లో పోరెల్ సిక్స్ బాది అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తరువాత 65 పరుగుల వద్ద పొరల్ అవుట్ కాగా 14 వ ఓవర్లో పంత్ కూడా 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సగం జట్టు పెవిలియన్ చెరటంతో స్కోర్ మందగించింది. యుజ్వేంద్ర వేసిన 18వ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. కానీ బౌల్ట్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. చివరి ఓవర్లో స్టబ్స్ పరవాలేదనిపించాడు . చివరిలో వరుసగా రెండు సిక్స్‌లు బాది ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. మొత్తానికి 65 పరుగులతో పోరెల్, 50 పరుగులతో జేక్ ఫ్రెసర్, 41 పరుగులతో స్టబ్స్ రాణించారు. ఈరోజు తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ కూడా 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్ తీయగా, బౌల్ట్, సందీప్, యుజ్వేంద్ర తలో వికెట్ పడగొట్టారు.
పటిష్టంగా ఉన్న రాజస్థాన్ జట్టు
రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ లో కొన్ని కారణాలతో ధ్రువ్, హెట్‌మేయర్ లు జట్టులో లేరు. వారి స్థానంలో శుభమ్ దూబె, డోనోవాన్ ఫెరెరా దిగారు. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రోవ్‌మన్ పావెల్ల తో రాజస్తాన్ బ్యాటింగ్ బలంగా ఉంది. గట్టిగా పోరాడటానికి సిద్ధంగా ఉంది.