DC Vs PBKS: ప్రభ్‌సిమ్రన్ వన్ మ్యాన్ షో - పంజాబ్ ఎంత స్కోర్ చేసింది?
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 168 పరుగులు కావాలి.
Delhi Capitals vs Punjab Kings: ఐపీఎల్ 2023 సీజన్ 59వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (103: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ తప్ప మిగతా బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ (103: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) మినహా ఎవ్వరూ రాణించలేదు. తనను ఒక ఎండ్‌లో నిలబెట్టి మరో ఎండ్‌లో వికెట్లు సమర్పించుకుంటూనే ఉంటారు. పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు శామ్ కరన్ (20: 24 బంతుల్లో, ఒక ఫోర్) కాసేపు క్రీజులో నిలిచాడు. కానీ పరుగులు మాత్రం వేగంగా చేయలేకపోయాడు. వీరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. శామ్ కరన్ అవుటయ్యాక ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌లో వేగాన్ని పెంచాడు. శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అవుట్ కావడంతో పంజాబ్ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 13, 2023
A splendid ton by Prabhsimran Singh guides @PunjabKingsIPL to 167/7 in the first innings 👌🏻👌🏻
Will it be enough for @DelhiCapitals? Stay tuned to find out 👊🏻
Scorecard ▶️ https://t.co/bCb6q4bzdn #TATAIPL | #DCvPBKS pic.twitter.com/3U9yphWb8j
పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఐదో స్థానం వరకు చేరవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గెలిచే తేడాను బట్టి ఆరో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం ఈ రెండు జట్లకూ ఈ విజయం చాలా కీలకం.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మనీష్ పాండే, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, అభిషేక్ పోరెల్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శామ్ కరన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మోహిత్ రాథీ