అన్వేషించండి

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ - ఆశలు నిలిచేదెవరికీ? కూలేదెవరికి ?

DC Vs GT, IPL 2024: ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఇక ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి పరిస్థితి . 

DC Vs GT  IPL 2024 Preview and Predictiom : ప్లే ఆఫ్‌ ఆశలు మరింత సంక్లిష్టం కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) తలపడనుంది. ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకుని వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ...  గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు పిడుగులా పడడంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు మెరుగ్గా రాణించాలని ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ కోరుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ మూడు విజయాలు... అయిదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. 
 
బౌలింగ్‌ లోపాలు అధిగమిస్తేనే..?
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు సృష్టించిన సునామీలో కొట్టుకుపోయారు. గుజరాత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బౌలర్లు మళ్లీ గాడిన పడాలని ఢిల్లీ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పవర్‌ప్లేలో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా రికార్డు 125 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలర్లు రాణించాలని పంత్‌ కోరుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 10 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... ఢిల్లీకి కీ బౌలర్‌గా ఉన్నాడు. ఇతను మరోసారి రాణించి మిగిలిన బౌలర్లు కూడా గాడినపడితే ఢిల్లీ బౌలింగ్ కష్టాలు తీరుతాయి.  హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 267 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ బ్యాటర్లు డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా విఫలమయ్యారు. పంత్ 35 బంతుల్లో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ యువ సంచలనం మెక్‌గర్క్ 18 బంతుల్లోనే 65 పరుగులు చేయడం పంత్‌ సేనకు అనుకూలంగా మారింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 42 పరుగులు చేసిన భిషేక్ పోరెల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. వీరు మరోసారి రాణిస్తే ఢిల్లీకి బ్యాటింగ్‌లో తిరుగుండదు.  
 
గుజరాత్‌ది అదే కథ
ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌ కూడా ఈ సీజన్‌లో అస్థిరంగానే కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన గుజరాత్‌... అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. గుజరాత్‌ ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ పాయింట్ల పట్టికలో పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే గుజరాత్‌కు కూడా ఇది కీలక మ్యాచ్‌. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రాణిస్తుండడం గుజరాత్‌కు సానుకూలంశం. రాహుల్ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాలని గుజరాత్‌ కోరుకుంటోంది. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రాణిస్తే ఢిల్లీ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. 
 
 
జట్లు:
ఢిల్లీ : రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యష్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, రిచర్డ్‌సన్, రసిఖ్ దార్, విక్కీ ఓస్ట్వాల్ , అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జోస్టల్ త్యాగి , దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్, మానవ్ సుతార్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Fatal Accident In Jaipur: జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Embed widget