By: ABP Desam | Updated at : 20 May 2023 03:28 PM (IST)
టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు ( Image Source : IPL Twitter )
Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్ 2023 సీజన్ 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మొదట బౌలింగ్ చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు నేరుగా అర్హత సాధించనుంది. మంచి రన్ రేట్‌తో గెలిస్తే టాప్ 2లోకి చేరుకునే అవకాశం ఉంది.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే చెన్నైకి ఈ విజయం చాలా ముఖ్యం. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే కాబట్టి జట్టు భారీ తేడాతో గెలిస్తే ఇంకా మంచిది. ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. కాబట్టి గెలిచినా ఓడినా వారికి పోయేదేమీ లేదు.
ఈ మ్యాచ్‌లో చెన్నై తన తుదిజట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ స్థానంలో చేతన్ సకారియా జట్టులోకి వచ్చాడు. అలాగే లలిత్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం దక్కింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
పృథ్వీ షా, ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్
ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి ఏడు గెలిచి ఐదు మ్యాచ్‌లు ఓడిన చెన్నై.. 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో కూడా ఇవే గణాంకాలతో మూడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో దాదాపు ఈ రెండు జట్లూ 2, 3 స్థానాల్లో ఉన్నా లీగ్ దశ ముగిసేనాటికి ఇదే కొనసాగాలంటే చెన్నై.. ఢిల్లీని ఓడించటం కీలకం కానుంది. ఢిల్లీని చెన్నై ఓడిస్తూనే.. మెరుగైన రన్ రేట్ సాధిస్తే అప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సీఎస్కే.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడే అవకాశముంటుంది. అలా కాకుండా ఢిల్లీతో సీఎస్కే ఓడి.. తమ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతాను ఓడిస్తే చెన్నై థర్డ్ పొజిషన్‌కు పడిపోతుంది. ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్‌ను ఓడిస్తే అప్పుడు దానికి 16 పాయింట్లు వచ్చి చెన్నై నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైకి ఢిల్లీతో మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం.
ఐపీఎల్-16ను వరుసగా ఐదు ఓటములతో ప్రారంభించి తర్వాత పడుతూ లేస్తూ ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించి ఈ సీజన్ లో అందరికంటే ముందే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేటి మ్యాచ్‌లో గెలిచినా ఓడినా పోయేదేం లేదు. దీంతో గత మ్యాచ్‌లో పంజాబ్‌కు షాకిచ్చినట్టే.. చెన్నైకి ఝలక్ ఇచ్చేందుకు వార్నర్ సేన రెడీ అయింది. పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ సందర్భంగా వార్నర్ కూడా తాము వచ్చే సీజన్ కు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామని, ఒత్తిడి లేకుండా ఆడుతున్నామని చెప్పాడు. అందుకే గత మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఏకంగా 213 పరుగుల భారీ స్కోరు చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే బెస్ట్ స్కోరు. ఇదే జోష్ చెన్నైతో మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తే తమిళ తంబీలకు తిప్పలు తప్పవు.
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?