అన్వేషించండి
Advertisement
IPL 2024: చేజారిన CSK కెప్టెన్ రుతురాజ్ సెంచరీ, హైదరాబాద్ లక్ష్యం 213
CSK vs SRH, IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
CSK vs SRH IPL 2024 Sunrisers Hyderabad target 213: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK) భారీ స్కోరు చేసింది. చెన్నై సొంత మైదానంలో సారధి రుతురాజ్ గైక్వాడ్ శతకానికి రెండు పరుగుల దూరంలోనే అగిపోయినా.. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన చెన్నై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నాక భారీ షాట్లు ఆడారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్... మంచి షాట్లతో అలరించాడు.
రుతురాజే హీరో
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 19 పరుగుల స్కోరు వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసిన అజింక్యా రహానేను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. షెహబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రుతురాజ్‌తో జత కలిసిన డేరిల్ మిచెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకు తిరుగులేని పునాది వేశారు. ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది రెండో వంద పరుగుల భాగస్వామ్యం కాడవం విశేషం. పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
డారిల్ మిచెల్- రుతురాజ్ క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడారు. సిక్సర్‌తో రుతురాజ్ అర్థ శతకాన్ని అందుకున్నాడు. 26 బంతుల్లో రుతురాజ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ 92 పరుగులకు చేరింది. తర్వాత డారిల్ మిచెల్ కూడా అర్ధ శతకం చేశాడు. 29 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 134 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన మిచెల్ అవుటయ్యాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో నితీశ్‌రెడ్డికి క్యాచ్ ఇచ్చి మిచెల్ పెవిలియన్ చేరాడు. కానీ రుతురాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేసి రుతురాజ్ అవుట్ చేశాడు. కచ్చితంగా శతకం చేస్తాడని భావించినా రుతురాజ్‌ను 98 పరుగుల వద్ద నటరాజన్ అవుట్ చేశాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో రుతురాజ్ అవుటయ్యాడు. 200 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే ఎప్పట్లాగే చివర్లో మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దూబే 20 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్ ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion