అన్వేషించండి

IPL 2024: కోల్‌కత్తా జైత్రయాత్రకు CSK బ్రేక్‌, రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

CSK vs KKR IPL 2024 :ఐపీఎల్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌ చెక్‌ పెట్టింది. 14 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

CSK vs KKR IPL 2024 Chennai Super Kings won by 7 wkts: ఐపీఎల్‌(IPL)లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌(KKR)కు చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) చెక్‌ పెట్టింది. మొదట బంతితో కోల్‌కత్తాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన చెన్నై... ఆ తర్వాత స్పల్ప లక్ష్యాన్ని సునాయంసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా...  చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మరో 14 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది.

మెరిసిన చెన్నై బౌలర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా ఇన్నింగ్స్‌ తొలి బంతికే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ తొలి బంతికే కోల్‌కత్తా బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ను తుషార్‌ దేశ్‌పాండే అవుట్‌ చేసి కోల్‌కత్తాకు షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సునీల్ నరైన్‌, రఘువంశీ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఆరు ఓవర్లలోనే 56 పరుగులు జోడించడంతో కోల్‌కత్తా కోలుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత వికెట్ల పతనం ఆరంభమైంది. పరుగులు రావడం కష్టం కావడంతో కోల్‌కత్తా బ్యాటర్లు భారీ షాట్లకు యత్నించి వికెట్లను సమర్పించుకున్నారు.  సునీల్‌ నరైన్‌ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసిన రఘువంశీని కూడా జడేజానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 56 పరుగుల వద్ద రఘువంశీ అవుటవ్వగా... 60 పరుగుల వద్ద సునీల్‌ నరైన్‌ పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్‌ కావడంతో కోల్‌కత్తా కష్టాల్లో పడింది. శ్రేయస్స్ అయ్యర్‌ 32 బంతుల్లో 34 పరుగులు చేసి అవుటయ్యాడు. వెంకటేష్‌ అయ్యర్‌ 3, రణదీప్‌ సింగ్‌ 13, రింకూసింగ్‌ 9, అండ్రూ రసెన్‌ పది పరుగులు చేసి అవుటయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న రింకూసింగ్‌, అండ్రూ రసెల్‌ తక్కువ పరుగులకే అవుట్‌ కావడంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీయగా... ముస్తాఫిజుర్‌ రెండు వికెట్లు తీశాడు. 
 
సునాయసంగా లక్ష్య ఛేదన
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. రుతురాజ్‌-రచిన్‌ తొలి వికెట్‌కు 26 పరుగులు జోడించారు. 8 బంతుల్లో 15 పరుగులు చేసిన రచిన్‌ను... అరోరా అవుట్‌ చేశాడు. తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌.. డేరిల్‌ మిచెల్‌.. చెన్నైను విజయం దిశగా నడిపించారు. రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించిన తర్వాత... 25 పరుగులు చేసిన మిచెల్‌ అవుటయ్యాడు. రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైకు సునాయస విజయాన్ని అందించాడు. శివమ్‌ దూబే 18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget