అన్వేషించండి

IPL 2024: కోల్‌కత్తాదే తొలి బ్యాటింగ్, నరైన్‌ మళ్లీ మెరుస్తాడా?

CSK vs KKR IPL 2024 : ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో వెనకబడిన చెన్నై సూపర్ కింగ్స్‌.. కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

CSK vs KKR  Chennai Super Kings opt to bowl: ఐపీఎల్‌(IPL 2024)లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో వెనకబడిన చెన్నై సూపర్ కింగ్స్‌(CSK).. కోల్‌కత్తా(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. సునీల్‌ నరైన్‌ పవర్‌ ప్లే వరకు క్రీజులో నిలబడ్డ.... చెన్నై ప్లేయర్లకు తిప్పలు తప్పవు. చెపాక్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైహోమ్‌ గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ బరిలోకి దిగుతుండగా ఇప్పటి వరకూ నాలుగు మ్యాచులు ఆడి రెండు విజయాలు రెండు పరాజయాలతో ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని భావిస్తోంది.

చెన్నై విజయాల బాట పట్టేనా..

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. అయితే జట్టులోని లోపాలను సవరించుకుని ముందు వెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ వ్యూహాలు రచిస్తోంది. కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఆడి భారీ స్కోర్లు అందించాలని చెన్నై కోరుకుంటోంది. రుతురాజ్‌ గైక్వాడ్, రచిన్‌ రవీంద్ర ఇప్పటివరకూ భారీ స్కోర్లు  నమోదు చేయకపోవడం చెన్నైను ఆందోళన పరుస్తోంది. శివమ్ దూబే 160.86 స్ట్రైక్ రేట్‌తో 148 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉండడం చెన్నైకి కలిసిరానుంది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీకి తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో చూడాలి. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ రిజ్వీ భారీ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై డకౌట్ కావడంతో... సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ ను చెన్నై జట్టులోకి తీసుకోలేదు. పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరాణలపై చెన్నై భారీ ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్లు మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేశ్ తీక్షణతో పాటు దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరిలచతో చెన్నై స్పిన్‌ దళం బలంగా ఉంది.


కోల్‌కత్తా జోరు సాగేనా..?
టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆశిస్తోంది. కోల్‌కత్తా బ్యాటర్లు స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసి వస్తోంది. సునీల్ నరైన్‌ మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఈ సీజన్‌లో జట్టులో కోల్‌కత్తా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న నరైన్... CSK బౌలర్‌లపై విరుచుకుపడాలని భావిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రమణదీప్ సింగ్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్ కూడా టచ్‌లో ఉండడం కోల్‌కత్తాకు కలిసిరానుంది. హర్షిత్ రాణా, రస్సెల్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్ మరియు వరుణ్ చక్రవర్తిలతో కోల్‌కత్తా బౌలింగ్ బలంగా ఉంది.


చెన్నై జట్టు: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, మిచెల్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ మరియు సమీర్ రిజ్వీ.


కోల్‌కత్తా జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ చక్రవర్తి చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget