
CSK Vs KKR: సీజన్‌లో అత్యల్ప స్కోరు చేసిన చెన్నై - కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్!
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2023 సీజన్ 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివం దూబే (48 నాటౌట్: 34 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. నైట్‌రైడర్స్ విజయానికి 120 బంతుల్లో 145 పరుగులు కావాలి. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నైకి ఇదే అత్యల్ప స్కోరు.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (17: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), డెవాన్ కాన్వే (30: 28 బంతుల్లో, మూడు ఫఓర్లు) డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 31 పరుగులు జోడించారు. అయితే పవర్ ప్లే ముగిశాక చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 12 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత రవీంద్ర జడేజా (20: 24 బంతుల్లో, ఒక సిక్సర్), శివం దూబే (48: 34 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు ఆరో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అయితే జడేజా మరీ నిదానంగా ఆడాడు. చివరి ఓవర్లో జడేజా అవుటయ్యాడు. చివర్లో వచ్చిన ధోని భారీ షాట్లు కొట్టడంలో విఫలం అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులకు పరిమితం అయింది.
Innings Break!@KKRiders restrict #CSK to 144/6 in the first innings 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 14, 2023
Will @ChennaiIPL successfully defend this target? We will find out soon 👊🏻
Scorecard ▶️ https://t.co/d7m0BcEtvi #TATAIPL | #CSKvKKR pic.twitter.com/FcqSEJzNCv
చెన్నై సూపర్ కింగ్స్ తన తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఒక్క మార్పు చేసింది. అనుకుల్ రాయల్ స్థానంలో వైభవ్ అరోరా తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే నెట్‌రన్‌రేట్ ప్రకారం మూడో స్థానం వరకు వెళ్లే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే మాత్రం అగ్రస్థానాన్ని దక్కించుకోనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, నిశాంత్ సింధు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
