CSK Vs DC: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై - ఫస్ట్ బ్యాటింగే అన్న ధోని!
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Chennai Super Kings vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మొదట బౌలింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రయోగమే చేసింది. ఫాంలో ఉన్న శివం దూబేను కాదని, ఫాంలో లేని అంబటి రాయుడుని ధోని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా ఓడినా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే ఉండనుంది. కానీ ఆ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలంటే మాత్రం విజయం సాధించాల్సిందే. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో గెలిస్తే వారు ఐదో స్థానంలోపు ఏ స్థానానికి అయినా చేరుకోవచ్చు. ఢిల్లీకి ఇది డూ ఆర్ డై లాంటి మ్యాచ్.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా
It's ACTION Time in Chennai 🙌
— IndianPremierLeague (@IPL) May 10, 2023
Who will win this one folks?
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX #TATAIPL | #CSKvDC pic.twitter.com/QRZ7Q9ewRk
A look at the Playing XIs of the two sides 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 10, 2023
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX #TATAIPL | #CSKvDC pic.twitter.com/nXbdEXvWPJ
🚨 Toss Update 🚨@ChennaiIPL win the toss and elect to bat first against @DelhiCapitals.
— IndianPremierLeague (@IPL) May 10, 2023
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX #TATAIPL | #CSKvDC pic.twitter.com/pdB9vcbOuu
Impact from the Start!
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
ATR Aatam aarambham 💥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/AXTskGZSOU
The Singam Squad Sheet is IN! 📋#DCvCSK #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/oAmGHoTpPL
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023