News
News
వీడియోలు ఆటలు
X

CSK Vs DC: చెపాక్‌లో తడబడిన చెన్నై - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.

FOLLOW US: 
Share:

Chennai Super Kings vs Delhi Capitals: చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పాతిక పరుగులు చేసిన శివం దూబేనే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాటర్లలో ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. 25 పరుగులే జట్టులో టాప్ స్కోర్. కానీ వచ్చిన వారందరూ చిన్న చిన్న క్యామియోలు ఆడారు. ఈ సిరీస్‌లో మంచి ఫాంలో ఉన్న ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (24: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), డెవాన్ కాన్వే (10: 13 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యారు. అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.

అయితే శివం దూబే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు), అంబటి రాయుడు (23: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు చెలరేగారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని (20: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.

పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా ఓడినా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే ఉండనుంది. కానీ ఆ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలంటే మాత్రం విజయం సాధించాల్సిందే. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో గెలిస్తే వారు ఐదో స్థానంలోపు ఏ స్థానానికి అయినా చేరుకోవచ్చు. ఢిల్లీకి ఇది డూ ఆర్ డై లాంటి మ్యాచ్.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా

Published at : 10 May 2023 09:36 PM (IST) Tags: CSK Delhi Capitals DC IPL CSK vs DC IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023 IPL 2023 Match 55

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం