అన్వేషించండి

Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇంగ్లీస్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు. వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే టోర్నీ నుండి వైదొలిగాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జోష్ ఇంగ్లిస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు.
  • వ్యక్తిగత కారణాలతో బ్రీట్జ్కే జట్టు నుండి వెళ్ళిపోయాడు.
  • ఇంగ్లిస్ రాకతో బ్యాటింగ్ లైనప్ బలోపేతం కానుంది.
  • ముంబైతో కీలక మ్యాచ్‌లో జట్టు ఆడనుంది.

Josh Inglis Joins Lucknow Super Giants Squad for IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఒక తీపి కబురు అందింది. ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఎట్టకేలకు జట్టుతో చేరాడు. మే 4న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక పోరుకు అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. మరోవైపు లక్నో జట్టులో కీలక సభ్యుడైన దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ మార్పు లక్నో బ్యాటింగ్ లైనప్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని యాజమాన్యం భావిస్తోంది.

 

పెళ్లి తర్వాత గ్రౌండ్ లోకి..
జోష్ ఇంగ్లిస్ ని ఐపీఎల్ వేలంలో రూ. 8.60 కోట్ల భారీ ధరకు లక్నో జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఏప్రిల్ 18న వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని మార్గరెట్ రివర్ లో అతని వివాహం నిశ్చయం కావడంతో లీగ్ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడిన ఇంగ్లిస్, 162 స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. పెళ్లి వేడుకలు ముగించుకుని ఇప్పుడు లక్నో క్యాంప్ లో చేరి ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. మిడిల్ ఆర్డర్ లో వేగంగా పరుగులు రాబట్టగల సత్తా ఉన్న ఇంగ్లిస్ రాకతో లక్నో టీమ్ బలోపేతం కానుంది.

బ్రీట్జ్కే ఔట్..
దక్షిణాఫ్రికాకు చెందిన మాథ్యూ బ్రీట్జ్కే టోర్నీ నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 26న కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన హోమ్ మ్యాచ్ కు ముందే అతను జట్టును వీడి వెళ్ళిపోయాడు. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి ఉత్కంఠ రేపినా, లక్నోకు విజయం దక్కలేదు. వ్యక్తిగత కారణాల వల్లే అతను ఇంటికి వెళ్ళినట్లు తాజాగా వెల్ల‌డైంది. బ్రీట్జ్కే స్థానాన్ని ఇప్పుడు జోష్ ఇంగ్లిస్ భర్తీ చేయనున్నాడు.

Also Read: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్

చావో రేవో పోరు..
మే 4న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇది తొమ్మిదో మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఇరు జట్లు కేవలం రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు అనివార్యం. రాబోయే వారం రోజులు లక్నోకు చాలా కీలకం. సోమవారం ముంబైతో, గురువారం లక్నో వేదికగా ఆర్సీబీతో, వచ్చే ఆదివారం చెన్నైలో సీఎస్‌కేతో వరుసగా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ బిజీ షెడ్యూల్ లో జోష్ ఇంగ్లిస్ రాక జట్టుకు పెద్ద ఊరట. వరుస సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో లక్నో పంజా విసురుతుందో లేదో చూడాలి. రిషబ్ పంత్ నాయకత్వంలోని ఈ టీమ్ లో ఇప్పుడు ఇంగ్లిస్ చేరడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ముంబై ఫ్యాన్స్ ముందు లక్నో తన సత్తా చాటుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

Also Read: మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీస్తూ దొరికిపోయిన శ్రీలంక క్రికెటర్లు

లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుత స్క్వాడ్:
రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ,అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్,  రఘువంశీ, మహమ్మద్ షమీ, జోష్ ఇంగ్లిష్, హిమ్మత్ సింగ్, ముకుల్ చౌదరి, అర్షిన్ కుల్కర్ణి, నమన్ తివారీ, అర్జున్ టెండూల్కర్, మణిమారన్ సిద్ధార్థ్, మయాంక్ ప్రభు యాదవ్, ఆకాష్ మహారాజ్ సింగ్.

Frequently Asked Questions

లక్నో సూపర్ జెయింట్స్‌లో కొత్తగా ఎవరు చేరారు?

ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ లక్నో సూపర్ జెయింట్స్‌తో చేరాడు. మే 4న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడు.

జోష్ ఇంగ్లిస్‌ను లక్నో జట్టు ఎంత ధరకు కొనుగోలు చేసింది?

జోష్ ఇంగ్లిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు ఐపీఎల్ వేలంలో రూ. 8.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

లక్నో జట్టు నుంచి ఎందుకు మాథ్యూ బ్రీట్జ్కే వెళ్ళిపోయాడు?

దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టు నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.

జోష్ ఇంగ్లిస్‌కు బదులుగా ఏ ఆటగాడు జట్టులోకి వచ్చాడు?

మాథ్యూ బ్రీట్జ్కే స్థానాన్ని ఇప్పుడు జోష్ ఇంగ్లిస్ భర్తీ చేయనున్నాడు. ఇతను మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టగల సత్తా ఉన్న ఆటగాడు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget