IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్తాన్ షెడ్యూల్ - సన్‌రైజర్స్‌తో మొదటి మ్యాచ్!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.
Rajasthan Royals IPL 2023 Schedule: భారతదేశంలో క్రికెట్ పండుగ త్వరలో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో నెల రోజుల్లో మొదలవునుంది. ఈసారి ఐపీఎల్ 2023 మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022 ట్రోఫీని గెలుచుకున్న గుజరాత్ టైటాన్స్ తమ మొదటి మ్యాచ్‌లో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.
ఐపీఎల్ 2023 తొలి, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 70 మ్యాచ్‌లు లీగ్ దశలో, 4 మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో జరగనున్నాయి. అన్ని జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడతాయి. వాటిలో ఏడు వారి సొంత మైదానంలో, ఏడు ప్రత్యర్థి జట్ల మైదానంలో ఆడతాయి.
కోవిడ్ -19 కారణంగా, బీసీసీఐ గత ఐపీఎల్ సీజన్‌ల మ్యాచ్‌లను పరిమిత మైదానాల్లో నిర్వహించింది. అయితే ఈసారి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పాత తరహాలోనే ఐపీఎల్ ఆడనుంది.
ఐపీఎల్ 2022 సీజన్ అంతటా మంచి క్రికెట్ ఆడిన సంజూ శాంసన్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి ఏప్రిల్ 2వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ పూర్తి షెడ్యూల్‌ను చూద్దాం.
రాజస్థాన్ రాయల్స్ షెడ్యూల్
2 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్
5 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, ACA స్టేడియం, గౌహతి
8 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ACA స్టేడియం, గౌహతి
12 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై
16 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
19 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
23 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
27 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
30 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై
5 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
7 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
11 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
14 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
19 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, HPCA స్టేడియం, ధర్మశాల
రాజస్తాన్ రాయల్స్ జట్టు
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రన్ హిట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కులదీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజవేంద్ర చాహల్ , జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ P A, జో రూట్.