News
News
X

IPL 2023: గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ! క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు.

FOLLOW US: 

IPL 2023: టీ20 క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. పది ఫ్రాంచైజీలు తమ హోమ్‌ గ్రౌండ్‌లో సగం మ్యాచులు ఆడతాయని ప్రకటించారు. మిగతా మ్యాచులు ప్రత్యర్థి మైదానాల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.

కరోనా మహమ్మారి రాకతో మూడేళ్లుగా ఐపీఎల్‌కు అనేక ఆంటకాలు ఎదురయ్యాయి. 2020 సీజన్లో లీగును కొన్ని నెలల పాటు నిరవధికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత యూఏఈలో అత్యంత కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల మధ్య నిర్వహించారు. 2021 సీజన్‌ను భారత్‌లోనే మొదలు పెట్టారు. ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో సగం సీజన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డెల్టా వేరియంట్‌ విపరీతంగా వ్యాపించడం, ఆక్సిజన్‌ లేక కొందరు ప్రాణాలు విడవడం, ఆటగాళ్లకు కరోనా రావడంతో రెండో దశను మళ్లీ యూఏఈలోనే పూర్తి చేశారు. 2022 సీజన్‌ను అత్యంత కట్టుదిట్టంగా భారత్‌లోనే నిర్వహించారు. ముంబయిలోని మూడు, పుణె మైదానంలో మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్, ఫైనల్‌ మ్యాచులకు మొతేరా ఆతిథ్యమిచ్చింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడింది. భారత్‌లో వ్యాక్సినేషన్ పూర్తైంది. దాంతో వచ్చే సీజన్‌ను మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 'వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ మళ్లీ పాత విధానంలోకి మారిపోతుంది. హోమ్‌ అండ్‌ అవే ఫార్మాట్లో మ్యాచులు జరుగుతాయి. పది జట్లు తమకు కేటాయించిన సొంత మైదానాల్లో మ్యాచులు ఆడతాయి' అని రాష్ట్ర సంఘాలకు గంగూలీ లేఖ రాశారని పీటీఐ తెలిపింది.

మహిళల ఐపీఎల్‌ గురించీ గంగూలీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది విమెన్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌ భారీ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. చాలా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు మహిళ జట్లు సొంతం చేసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని వెల్లడించారు. 'మహిళల ఐపీఎల్‌ కోసం బీసీసీఐ ఎంతో ఆసక్తితో పనిచేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఫస్ట్‌ సీజన్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాం' అని గంగూలీ లేఖలో తెలిపారు.

వచ్చే సీజన్లో ఐపీఎల్‌ ఎక్కువ రోజులు జరుగుతుందని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది. ఈ మేరకు ఇంగ్లాండ్ బోర్డుతో గంగూలీ, జేషా గతంలో చర్చించారు. మిగతా బోర్డులతోనూ సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంగర్‌ విండోకు ఐసీసీ సైతం అంగీకరించింది. గతంలో ఎనిమిది జట్లతో ఉన్న ఐపీఎల్‌ పదికి పెరిగింది. 2022 సీజన్‌ సూపర్‌ హిట్టైంది. గుజరాత్‌ టైటాన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. అయితే ఐపీఎల్‌ కోసం లాంగర్‌ విండో కావాలని బీసీసీఐ అనుకుంటోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి మహిళలకు కచ్చితంగా లీగ్‌ నిర్వహించనుంది. ఇందుకోసం సెప్టెంబర్‌-అక్టోబర్‌ విండోను ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అన్ని దేశాల బోర్డులతో చర్చించింది.

Published at : 22 Sep 2022 04:57 PM (IST) Tags: BCCI Sourav Ganguly IPL IPL 2023 Home Away Format

సంబంధిత కథనాలు

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

India Wicket Keeper T20 WC: పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

India Wicket Keeper T20 WC:  పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?