Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!
ఐపీఎల్ కొత్త జట్టు లఖ్‌నవూ ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంది. ఊహించినట్టే కేఎల్ రాహుల్ను ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్, టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ను తీసుకుంది.
![Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!! IPL 2022: KL Rahul, Marcus Stoinis, Ravi Bishnoi picked up for lucknow franchise ahead IPL mega auction Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/18/5d099e022d2f286e53cd055767a6435d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న ముగ్గురు ఆటగాళ్ల జాబితా బయటకొచ్చింది! అందరూ అనుకున్నట్టే కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసుకుంది. అతడితో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్, యువ క్రికెటర్ రవి బిష్ణోయ్‌ను తీసుకుందని తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగు సరికొత్త సీజన్లో పది జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది ఫ్రాంచైజీలు ఉండగా అహ్మదాబాద్, లఖ్‌నవూ వేదికలుగా మరో రెండు వచ్చాయి. ఇంతకు ముందే హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌ను అహ్మదాబాద్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. నిజానికి అతడిని రూ.16 కోట్లతో తొలి ప్రాధాన్య ఆటగాడిగా తీసుకుంటామని పంజాబ్ కింగ్స్ చెప్పింది. అయినప్పటికీ అతడు జట్టు నుంచి బయటకు వచ్చేందుకే సిద్ధపడ్డాడు. ఇకపై లఖ్‌నవూకు నాయకత్వం వహించనున్నాడు. అతడికి కొత్త ఫ్రాంచైజీ రూ.15 కోట్లు ఇస్తోంది.
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్ శర్మకు మాత్రం నో ఛాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
కొన్నేళ్లుగా టీ20 క్రికెట్లో మార్కస్ స్టాయినిస్ నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అటు ఆస్ట్రేలియాకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందుకోవడంలో సాయపడ్డాడు. రెండు సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్‌కు బలంగా మారాడు. మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు భారీ సిక్సర్లు బాదగలగడం అతడి ప్రత్యేకత. లఖ్‌నవూ అతడికి రూ.11 కోట్లు ఆఫర్ చేస్తోందట.
యువ మిస్టరీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం కేఎల్ రాహుల్ ఆడిన పంజాబ్ కింగ్స్‌కే ఆడేవాడు. రెండేళ్లుగా ఐపీఎల్‌లో తన లెగ్ స్పిన్‌తో మహామహులైన క్రికెటర్లను వణికించాడు. కెప్టెన్ అడిగిన ప్రతిసారీ వికెట్లు తీయడమే కాకుండా పరుగులను నియంత్రించాడు. అతడికి రూ.4 కోట్లు చెల్లిస్తున్నారు. ఇంతకు ముందే లఖ్‌నవూ జట్టు గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా ప్రకటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)