News
News
X

IPL 2022: లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలకు జనవరి 22 తుది గడువు

రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ రెండు జట్లు ముగ్గురు చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తుది గడువును నిర్దేశించింది. జనవరి 22లోపు క్రికెటర్లను తీసుకోవాలని ఆదేశించింది.

FOLLOW US: 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ రెండు జట్లు ముగ్గురు చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు తుది గడువును నిర్దేశించింది. జనవరి 22లోపు క్రికెటర్లను తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎల్‌ పాలక మండలి ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మీడియాకు సమాచారం ఇచ్చారు.

'అహ్మదాబాద్‌, లఖ్‌నవూ ఫ్రాంచైజీలకు జనవరి 22ను తుది గడువుగా నిర్ణయించాం. ఆ లోపు ముసాయిదా ఆటగాళ్లను ఎంచుకోవాలి' అని బ్రిజేశ్‌ పటేల్‌ ఏఎన్‌ఐకి తెలిపారు. ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12, 13న బెంగళూరులో నిర్వహిస్తామని వెల్లడించారు. వివో స్థానంలో టాటా గ్రూప్‌ను ప్రధాన స్పాన్సర్‌గా ఎంపిక చేశామని స్పష్టం చేశారు.

ఐపీఎల్‌ 2022 సీజన్‌ వేలాన్ని ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహిస్తారని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో మాత్రం వేరే నిర్ణయం వెలువడింది. 12, 13 స్థానాల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు నిర్వహించే చివరి మెగా వేలం ఇదేనని సమాచారం. మూడు, నాలుగేళ్లకు ఒకసారి భారీ వేలం నిర్వహించడం వల్ల తాము తయారు చేసుకున్న ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తోందని ఫ్రాంచైజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

కొత్త సంవత్సరంలో ఐపీఎల్‌ను పది జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సంజీవ్‌ గోయెంకాకు చెందిన వ్యాపార సంస్థ లఖ్‌నవూ ఫ్రాంచైజీని దక్కించుకోగా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సీవీసీ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. మొన్నటి వరకు సీవీసీకి బీసీసీఐ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. తాజా సమావేశంలో రెండు ఫ్రాంచైజీలకు క్లియరెన్స్‌ లభించింది. ఇక ఈ రెండు జట్లు తలో ముగ్గురు ఆటగాళ్లను ముసాయిదా నుంచి ఎంచుకోనున్నాయి.

లఖ్‌నవూ ఫ్రాంచైజీ దూకుడుగానే కనిపిస్తోంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంది. గ్రాంట్‌ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. పాత జట్లు మెగా ఆక్షన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. తాము ఎంతో కష్టపడి రూపొందించుకున్న జట్లను త్యాగం చేయాల్సి వస్తోందని బాధపడుతున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్ ధావన్‌, కాగిసో రబాడా, అశ్విన్‌ వంటి క్రికెటర్లను వదిలేయడం ఎంతో బాధగా ఉందని దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్‌ జిందాల్‌ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

Published at : 12 Jan 2022 06:58 PM (IST) Tags: IPL BCCI Bengaluru lucknow Ahmedabad IPL Auction Brijesh Patel IPL Chairman IPL Auction 2022 IPL Auction 2022 Date Indian Premiere League IPL 2022 Update

సంబంధిత కథనాలు

IND vs SA T20: బుమ్రా దూరం.. దక్షిణాఫ్రికాతో మిగిలిన టీ20లకు సిరాజ్ ఎంపిక

IND vs SA T20: బుమ్రా దూరం.. దక్షిణాఫ్రికాతో మిగిలిన టీ20లకు సిరాజ్ ఎంపిక

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు, ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

National Games 2022: నేటి నుంచే జాతీయ క్రీడలు, ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

IND vs SA 1st T20: దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. రాణించిన రాహుల్, సూర్యకుమార్

IND vs SA 1st T20:  దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. రాణించిన రాహుల్, సూర్యకుమార్

IND vs SA T20: దక్షిణాఫ్రికాను వణికించిన భారత బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

IND vs SA T20: దక్షిణాఫ్రికాను వణికించిన భారత బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!