Kohli IPL Record: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. టీ20ల్లో తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
ఐపీఎల్ 2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మైలురాయిని చేరుకోవడం విశేషం.
Virat Kohli T20 Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇటీవల ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్ లలో ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచి కోహ్లీ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 10,000 టీ20 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 10,000 మార్క్ చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
దుబాయ్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు పది వేల టీ20 పరుగుల మార్కుకు విరాట్ కోహ్లీ కేవలం 13 పరుగుల దూరంలో ఉన్నాడు. నేటి ఐపీఎల్ 2021 మ్యాచ్‌లో సిక్స్‌తో పరుగుల వేట ప్రారంభించిన కోహ్లీ ఆపై మరింత దూకుడును ప్రదర్శించాడు. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఓవరాల్ గా ఈ మార్కు చేరుకున్న 5వ ఆటగాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 14,261 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 446 మ్యాచ్‌లలో 22 36.94 స్ట్రైక్ రేట్‌తో 22 శతకాలు, 87 అర్థ శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
Also Read: థ్రిల్లర్‌ను మించి ధోనీసేన విజయం.. ఆఖర్లో జడ్డూ అద్భుతం
ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా..
ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కు ముందు కోహ్లీ 311 మ్యాచ్‌లలో 5 శతకాలు, 72 అర్ధ శతకాల సాయంతో 9929 పరుగులు చేశాడు. 2007లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ 133.95 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. తన టాలెంట్ నిరూపించుకుంటున్న తరుణంలోనే ఐపీఎల్ లో ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 9 ఏళ్లపాటు సేవలు అందించిన కోహ్లీ ఈ సీజన్ ముగిసిన తరువాత ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలుగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన నిర్ణయాన్ని వెల్లడించి ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాకిచ్చాడు.
Also Read: రోహిత్ x కోహ్లీ.. ఒకే జట్ల చేతుల్లో ఓడారు.. ఇప్పుడేం చేస్తారు?
ఐపీఎల్ లో 201 మ్యాచ్‌లాడిన కోహ్లీ 6134 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున 90 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించిన కింగ్ కోహ్లీ 3159 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా అవతరించాడు. ఫార్మాట్ ఏదైనా వన్డేలు, టీ20లు, టెస్టులలో తన బ్యాట్‌తో విమర్శకులకు బ్యాటర్‌గా సమాధానం ఇచ్చాడు. కానీ కెప్టెన్సీ మేజర్ టోర్నీలు అందించలేక పోవడం కోహ్లీని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పలు సందర్భాలలో విమర్శలు ఎదుర్కొన్నాడు.
Also Read: ఆర్‌సీబీ కొత్త సారథిగా కేఎల్ రాహుల్! ముగ్గుర్ని ప్రతిపాదించిన మంజ్రేకర్‌తో విభేదించిన స్టెయిన్!