అన్వేషించండి

RCB vs KKR Live Updates: బెంగళూరుపై నాలుగు వికెట్లతో కోల్‌కతా విజయం.. ‘ఈ సాల’ కూడా కప్ దొరకలేదు!

IPL 2021, Match 58, RCB vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఓడిన జట్టు ఇంటికి వెళ్లిపోతుంది.

19.4 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 139-6, నాలుగు వికెట్లతో కోల్‌కతా విజయం
19.4 ఓవర్లలో కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో నాలుగు వికెట్లతో విజయం సాధించింది. 
ఇయాన్ మోర్గాన్ 5(7)
షకీబ్ అల్ హసన్ 9(6)
డాన్ క్రిస్టియన్ 1.4-0-29-0

----

19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 132-6, లక్ష్యం 139 పరుగులు
జార్జ్ కార్టన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. అవుటయ్యారు. కోల్‌కతా విజయానికి ఆరు బంతుల్లో ఏడు పరుగులు కావాలి.
ఇయాన్ మోర్గాన్ 4(6)
షకీబ్ అల్ హసన్ 3(3)
జార్ట్ కార్టన్ 3-0-29-0

--------

18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 127-6, లక్ష్యం 139 పరుగులు
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ అవుటయ్యారు. కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు కావాలి.
ఇయాన్ మోర్గాన్ 1(2)
షకీబ్ అల్ హసన్ 1(1)
మహ్మద్ సిరాజ్ 4-0-19-2

-------

17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 124-4, లక్ష్యం 139 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 15 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 26(14)
దినేష్ కార్తీక్ 9(10)
హర్షల్ పటేల్ 4-0-19-2

-----

16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 120-4, లక్ష్యం 139 పరుగులు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 25(11)
దినేష్ కార్తీక్ 7(7)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 3-0-25-0

--------

15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 112-4, లక్ష్యం 139 పరుగులు
చాహల్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 30 బంతుల్లో 27 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 23(9)
దినేష్ కార్తీక్ 1(3)
చాహల్ 4-0-16-2
నితీష్ రాణా (సి) డివిలియర్స్ (బి) చాహల్ (23: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

------

14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 110-3, లక్ష్యం 139 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 36 బంతుల్లో 29 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 22(8)
నితీష్ రాణా 23(23)
హర్షల్ పటేల్ 3-0-16-2

-------

13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 107-3, లక్ష్యం 139 పరుగులు
యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 42 బంతుల్లో 32 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 21(7)
నితీష్ రాణా 21(18)
యజ్వేంద్ర చాహల్ 3-0-14-1

-------

12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 101-3, లక్ష్యం 139 పరుగులు
డాన్ క్రిస్టియన్ వేసిన ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్ మూడు సిక్సర్లు కొట్టాడు. కోల్‌కతా విజయానికి 48 బంతుల్లో 38 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 19(4)
నితీష్ రాణా 18(15)
డాన్ క్రిస్టియన్ 1-0-22-0

------

11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 79-3, లక్ష్యం 139 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 54 బంతుల్లో 60 పరుగులు కావాలి.
సునీల్ నరైన్ 0(0)
నితీష్ రాణా 15(11)
హర్షల్ పటేల్ 2-0-17-0
వెంకటేష్ అయ్యర్ (సి) భరత్ (బి) హర్షల్ పటేల్ (26: 30 బంతుల్లో, ఒక సిక్సర్)

-------

10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 74-2, లక్ష్యం 139 పరుగులు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 60 బంతుల్లో 65 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 24(26)
నితీష్ రాణా 15(11)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-17-0

------

9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 61-2, లక్ష్యం 139 పరుగులు
యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 66 బంతుల్లో 78 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 22(24)
నితీష్ రాణా 4(7)
యజ్వేంద్ర చాహల్ 2-0-9-1

------

8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 57-2, లక్ష్యం 139 పరుగులు
గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 72 బంతుల్లో 82 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 20(22)
నితీష్ రాణా 2(3)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1-0-4-0

-------

7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 53-2, లక్ష్యం 139 పరుగులు
యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 78 బంతుల్లో 86 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 18(19)
నితీష్ రాణా 0(0)
యజ్వేంద్ర చాహల్ 1-0-5-1
రాహుల్ త్రిపాఠి (ఎల్బీడబ్ల్యూ) (బి) చాహల్ (6: 5 బంతుల్లో, ఒక ఫోర్)

--------

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 48-1, లక్ష్యం 139 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండో బంతికి శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 84 బంతుల్లో 91 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 15(16)
రాహుల్ త్రిపాఠి 4(2)
హర్షల్ పటేల్ 1-0-8-1
శుభ్‌మన్ గిల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ (29: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు)

--------

ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 40-0, లక్ష్యం 139 పరుగులు
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 90 బంతుల్లో 99 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 11(13)
శుభ్‌మన్ గిల్ 29(17)
మహ్మద్ సిరాజ్ 3-0-16-0

------

నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 34-0, లక్ష్యం 139 పరుగులు
జార్జ్ గార్టన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 96 బంతుల్లో 105 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 10(10)
శుభ్‌మన్ గిల్ 24(14)
జార్జ్ గార్టన్ 2-0-24-0

-------

మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 19-0, లక్ష్యం 139 పరుగులు
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 102 బంతుల్లో 120 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 9(9)
శుభ్‌మన్ గిల్ 10(9)
మహ్మద్ సిరాజ్ 2-0-10-0

-------

రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 16-0, లక్ష్యం 139 పరుగులు
జార్జ్ గార్టన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 108 బంతుల్లో 123 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 8(6)
శుభ్‌మన్ గిల్ 8(6)
జార్జ్ గార్టన్ 1-0-9-0

-------

మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 7-0, లక్ష్యం 139 పరుగులు
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 114 బంతుల్లో 132 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 1(2)
శుభ్‌మన్ గిల్ 6(4)
మహ్మద్ సిరాజ్ 1-0-7-0

--------

20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 138-7, కోల్‌కతా లక్ష్యం 139 పరుగులు
శివం మావి వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి క్రిస్టియన్ రనౌటయ్యాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 139 పరుగులు సాధించాలి.
హర్షల్ పటేల్ 8(6)
జార్జ్ గార్టన్ 0(0)
శివం మావి 4-0-36-0
డాన్ క్రిస్టియన్ (రనౌట్ ఫెర్గూసన్/శివం మావి) (9: 8 బంతుల్లో, ఒక ఫోర్)

------

19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 126-6
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రెండో బంతికి క్రిస్టియన్ ఫోర్ కొట్టగా, చివరి బంతికి షాబాజ్ అవుటయ్యాడు.
హర్షల్ పటేల్ 0(0)
డాన్ క్రిస్టియన్ 2(3)
లోకి ఫెర్గూసన్ 3-0-25-0
షాబాజ్ అహ్మద్ (సి) శివం మావి (బి) లోకి ఫెర్గూసన్ (13: 14 బంతుల్లో, ఒక ఫోర్)

-----

18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 119-5
శివం మావి వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
షాబాజ్ అహ్మద్ 12(12)
డాన్ క్రిస్టియన్ 2(3)
శివం మావి 3-0-25-0

-------

17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 113-5
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ఓవర్ నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు.
షాబాజ్ అహ్మద్ 8(9)
డాన్ క్రిస్టియన్ 0(0)
సునీల్ నరైన్ 4-0-21-4
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) ఫెర్గూసన్ (బి) నరైన్ (15: 18 బంతుల్లో, ఒక ఫోర్)

-------

16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 111-5
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి.
షాబాజ్ అహ్మద్ 6(6)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 15(15)
వరుణ్ చక్రవర్తి 4-0-20-0

-------

15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 108-5
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండో బంతికి డివిలియర్స్ క్లీన్ బౌల్డయ్యాడు. మూడో బంతికి షాబాజ్ అహ్మద్ బౌండరీ సాధించాడు.
షాబాజ్ అహ్మద్ 5(2)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 13(13)
సునీల్ నరైన్ 3-0-19-3

------

14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 100-3
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 
ఏబీ డివిలియర్స్ 9(7)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 13(11)
వరుణ్ చక్రవర్తి 3-0-17-0

-------

13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 94-3
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఓవర్ రెండో బంతికి విరాట్ క్లీన్ బౌల్డయ్యాడు. చివరి బంతికి ఏబీడీ ఫోర్ కొట్టాడు.
ఏబీ డివిలియర్స్ 5(3)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 11(9)
సునీల్ నరైన్ 2-0-11-2
విరాట్ కోహ్లీ (బి) సునీల్ నరైన్ (39: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు)

------

12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 87-2
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతికి విరాట్ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లీ 39(32)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9(7)
లోకి ఫెర్గూసన్ 3-0-23-1

------

11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 79-2
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఓవర్ మూడో బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లీ 34(28)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 8(5)
షకీబ్ అల్ హసన్ 4-0-24-0

------

10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 70-2
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఓవర్ నాలుగో బంతికి శ్రీకర్ భరత్ అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ 32(26)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1(1)
సునీల్ నరైన్ 1-0-4-1
శ్రీకర్ భరత్ (సి) వెంకటేష్ అయ్యర్ (బి) సునీల్ నరైన్ (9: 16 బంతుల్లో)

------

9 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 66-1
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 30(23)
శ్రీకర్ భరత్ 8(14)
షకీబ్ అల్ హసన్ 3-0-15-0

--------

8 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 62-1
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 28(21)
శ్రీకర్ భరత్ 6(10)
వరుణ్ చక్రవర్తి 2-0-11-0

--------

ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 57-1
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 26(19)
శ్రీకర్ భరత్ 4(6)
షకీబ్ అల్ హసన్ 2-0-11-0

--------

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 53-1
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఓవర్ మొదటి బంతికి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ 24(16)
శ్రీకర్ భరత్ 2(3)
లోకి ఫెర్గూసన్ 2-0-16-1
దేవ్‌దత్ పడిక్కల్ (బి) లోకి ఫెర్గూసన్ (21: 18 బంతుల్లో, రెండు ఫోర్లు)

-------

ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 49-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. కోహ్లీ ఓవర్ మొదటి బంతికి బౌండరీ సాధించాడు.
విరాట్ కోహ్లీ 22(14)
దేవ్‌దత్ పడిక్కల్ 21(17)
శివం మావి 2-0-19-0

--------

నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 36-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దేవ్‌దత్ పడిక్కల్ ఓవర్ మొదటి, ఐదు బంతులకు బౌండరీలు సాధించాడు.
విరాట్ కోహ్లీ 16(11)
దేవ్‌దత్ పడిక్కల్ 19(14)
లోకి ఫెర్గూసన్ 1-0-12-0

---------

మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 24-0
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 15(10)
దేవ్‌దత్ పడిక్కల్ 8(9)
వరుణ్ చక్రవర్తి 1-0-7-0

----------

రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 17-0
శివం మావి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో కోహ్లీ రెండు బౌండరీలు కొట్టాడు.
విరాట్ కోహ్లీ 13(8)
దేవ్‌దత్ పడిక్కల్ 3(5)
శివం మావి 1-0-10-0

------

మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 7-0
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఓవర్ ఆఖరి బంతికి కోహ్లీ బౌండరీ కొట్టాడు.
విరాట్ కోహ్లీ 5(4)
దేవ్‌దత్ పడిక్కల్ 2(2)
షకీబ్ అల్ హసన్ 1-0-7-0

------

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), డాన్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్

-------

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

----------

ఐపీఎల్‌లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. లీగ్ లీడర్ ఢిల్లీపై చివరి బంతికి విజయం సాధించి.. రాయల్ చాలెంజర్స్ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఏకంగా 86 పరుగులతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ విజయాలతో ఉండటంతో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది.

ఆర్‌సీబీకి గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫాం జట్టుకు పెద్ద ప్లస్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మ్యాక్స్‌వెల్ 498 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, చాహల్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈలో సూపర్ ఫాంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు విజయాలు సాధించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి బీభత్సమైన ఫాంలో ఉన్నారు. నితీష్ రాణా కూడా అడపాదడపా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. బౌలర్లలో శివం మావి, లోకి ఫెర్గూసర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తూ అదరగొడుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 13 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget