అన్వేషించండి

MI vs DC Live Updates: అయ్యో.. ముంబయి! కీలక మ్యాచులో ఓటమి

ఐపీఎల్‌ మ్యాచ్‌-46లో తలపడుతున్న ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని దిల్లీ పట్టుదల.

LIVE

Key Events
MI vs DC Live Updates: అయ్యో.. ముంబయి! కీలక మ్యాచులో ఓటమి

Background

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంటోంది. మ్యాచులు ముగిసే కొద్దీ అభిమానులకు మజా దొరుకుతుంటే కొన్ని జట్లకేమో చావోరేవో తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ది సరిగ్గా ఇదే పరిస్థితి. ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే ఆ జట్టు శనివారం దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటి? ఏ జట్టు వ్యూహం ఎలా ఉండబోతోంది?

ముంబయి తప్పక గెలవాలి
ఈ సీజన్లో 11 మ్యాచులాడిన దిల్లీ క్యాపిటల్స్ 8 విజయాలతో 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. 11 మ్యాచులాడిన ముంబయి ఐదు మాత్రమే గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా సైతం ఐదే గెలిచినా నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో రోహిత్‌ సేన వెనకబడింది. దిల్లీ సాంకేతికంగా ప్లేఆఫ్స్‌ చేరినా అధికారికంగా మరో విజయం అందుకోవాలి. మరో రెండు మ్యాచులు మిగిలే ఉండటంతో ఇందులో ఓడినా ఫర్వాలేదు! ముంబయి పరిస్థితి మాత్రం అలా లేదు. కప్పు కొట్టాలంటే ముందీ మ్యాచ్‌ గెలవాలి. కోల్‌కతా చేతిలో ఓడిన రిషభ్‌ సేన ఈ పోరును తేలిగ్గా తీసుకోదు కాబట్టి ముంబయి కష్టపడాల్సిందే. ఆ తర్వాత హైదరాబాద్‌, రాజస్థాన్‌పై సునాయాసంగా గెలవొచ్చు!

మానసికంగా ముంబయిదే పైచేయి!
ఐపీఎల్‌లో దిల్లీపై ముంబయిదే పైచేయి! ఈ రెండు జట్లు 29 సార్లు తలపడితే విజయాల శాతం 16-13గా ఉంది. అంటే రోహిత్‌సేనకు పూర్తిగా ఆధిపత్యం లేదనే చెప్పాలి. అయితే చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో హిట్‌మ్యాన్‌ సేన దుమ్మురేపింది. ఆ నాలుగు గతేడాదే ఆడటం గమనార్హం. అంటే రెండు లీగులు, ఒక క్వాలిఫయర్‌, ఫైనల్‌ అన్నమాట! ముంబయి మానసికంగా బలంగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం.

జయంత్‌ కీలకం
యూఏఈకి వచ్చాక ముంబయి తన స్థాయికి తగిన ఆట ఆడలేదు. వరుసగా మూడు మ్యాచులు ఓడి మొన్నే పంజాబ్‌పై గెలిచింది. రోహిత్‌, డికాక్‌ నిలకడగానే ఆడుతున్నారు. మిడిలార్డర్‌ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్‌ నుంచి అభిమానులు మెరుపులు ఆశిస్తున్నారు. పొలార్డ్‌ నిలవాల్సి ఉంది. రాహుల్‌ చాహర్‌ను పూర్తిగా వినియోగించుకోవడం లేదు. బౌలర్లు పరుగులిస్తున్నారు. వారు మెరుగవ్వాలి. దిల్లీపై జయంత్‌ యాదవ్‌కు అద్భుతమైన రికార్డుంది. అంటే అతడు ఆడటం గ్యారంటీ. రిషభ్‌, అక్షర్‌, ధావన్‌, శ్రేయస్‌ను అడ్డుకోగలడు. ఈ పోరులో దిల్లీ కచ్చితంగా కొత్త వ్యూహ్యాలతో వస్తుంది. వాటిని తిప్పికొడితేనే ముంబయి హిట్టవుతుంది.

ఇక్కడ అశ్విన్‌ ఉన్నాడు
దిల్లీ క్యాపిటల్స్‌కు ఒత్తిడేం లేదు. ముంబయి, చెన్నై, బెంగళూరుపై ఏ ఒక్కటి గెలిచినా చాలు. ఐతే హిట్‌మ్యాన్‌ సేనను దిల్లీ ఓడించాలని వారి కన్నా ఎక్కువగా బెంగళూరు, కోల్‌కతా కోరుకుంటున్నాయి! అప్పుడే ఆ రెండింటికీ భయం ఉండదు. గాయపడ్డ పృథ్వీషా అందుబాటులోకి రావొచ్చు. అయితే మార్కస్‌ స్టాయినిస్‌ కోసం ఆ జట్టు ఎంతగానో ఎదురు చూస్తోంది. ఇవి మినహా ఆ జట్టులో ఎక్కువ మార్పులేమీ ఉండకపోవచ్చు. అశ్విన్‌ బౌలింగ్‌లో డికాక్‌, రోహిత్‌, కృనాల్‌ ఇబ్బంది పడటం దిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే సూర్య అతడి బౌలింగ్‌ను ఊచకోత కోయగలడు. అతడితో జాగ్రత్తగా ఉండాలి. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ ఒక్కోసారి కుప్పకూలుతోంది. దాన్ని సరిదిద్దుకొంటే దిల్లీకి తిరుగుండదు.

19:18 PM (IST)  •  02 Oct 2021

అయ్యో.. ముంబయి! కీలక మ్యాచులో ఓటమి

కృనాల్‌ వేసిన 19.1వ బంతిని అశ్విన్‌ (20) సిక్సర్‌గా బాదేసి ఉత్కంఠకు తెరదించాడు. ముంబయికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. మరోఎండ్‌లో శ్రేయస్‌ (33) అజేయంగా నిలిచాడు. దిల్లీ 19.1 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 130 పరుగుల లక్ష్యం ఛేదించింది.

19:14 PM (IST)  •  02 Oct 2021

19 ఓవర్లకు దిల్లీ 126-6

బౌల్ట్‌ 7 పరుగులు ఇచ్చాడు. యాష్‌ (14), అయ్యర్‌ (33) తెలివిగా పరుగులు చేశారు. దిల్లీకి 6 బంతుల్లో 4 పరుగులు కావాలి.

19:07 PM (IST)  •  02 Oct 2021

18 ఓవర్లకు దిల్లీ 119-6

బుమ్రా ఎనిమిది పరుగులు ఇచ్చాడు. శ్రేయస్‌ (30), అశ్విన్‌ (10) తెలివిగా ఆడారు. సింగిల్స్‌ తీశారు. ఆఖరి బంతిని శ్రేయస్‌ బౌండరీకి బాదడంతో దిల్లీపై ఒత్తిడి తగ్గింది. ఆ జట్టుకు 12 బంతుల్లో 11 పరుగులు అవసరం.

19:02 PM (IST)  •  02 Oct 2021

17 ఓవర్లకు దిల్లీ 111-6

కౌల్టర్‌నైల్‌ ఆరు పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని శ్రేయస్‌ (24) బౌండరీకి తరలించాడు. అశ్విన్‌ (8) నిలకడగా ఆడుతున్నాడు. దిల్లీకి 18 బంతుల్లో 19 పరుగులు అవసరం.

18:57 PM (IST)  •  02 Oct 2021

16 ఓవర్లకు దిల్లీ 105-6

బౌల్ట్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఐదు పరుగులు ఇచ్చాడు. శ్రేయస్‌ (19), అశ్విన్‌ (7) నిలకడగా ఆడుతున్నారు. భారీ షాట్లకు వెళ్లడం లేదు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget