By: ABP Desam | Updated at : 23 Feb 2023 06:17 PM (IST)
టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు (Image Credits: BCCI Women)
భారత్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ దూరం అవుతారని వార్తలు వచ్చాయి. కానీ హర్మన్ ప్రీత్ మ్యాచ్ సమయానికి కోలుకుంది. పూజా వస్త్రాకర్ కోలుకోలేకపోయింది. దీంతో తన స్థానంలో స్నేహ్ రాణా జట్టులోకి వచ్చింది. భారత్ ఇంక జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు.
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI)
అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్
అంతకు ముందు సెమీస్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఫలితం డక్‌వర్త్ లూయిస్ ద్వారా వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
టీమ్ ఇండియా తరుపున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 87 పరుగులతో భారీ అర్ధ సెంచరీ చేసింది. స్మృతి అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీమ్ ఇండియా మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్ తర్వాత సెమీ ఫైనల్‌కు చేరిన రెండో జట్టు టీమిండియానే. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కచ్చితంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
భారత జట్టు తరఫున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమె 56 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి తొమ్మిది ఫోర్లు, మూడు అద్భుతమైన సిక్సర్లు కొట్టింది.
స్మృతి మంధాన తొలి వికెట్‌కు షెఫాలీ వర్మతో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అదే సమయంలో చివరి ఓవర్లలో ఆమె బౌలర్లపై భారీగా విరుచుకుపడింది. ఫోర్లు, సిక్సర్లో చెలరేగి పోయింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ తన ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చేయాల్సిన పరుగుల కంటే ఐదు పరుగులు తక్కువ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితం రావడం అభిమానులకు నిరాశ కలిగించింది.
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!
UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్.. హరికేన్ ఇన్నింగ్స్ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !