Ind vs Eng: కోహ్లీ సేనకు సన్ స్ట్రోక్... బ్యాట్లెత్తేశారు.. మ్యాచ్ వదిలేశారు..
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ అత్యంత ఘోరమైనా విఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ అత్యంత ఘోరమైనా విఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి తన ఖాతాలో వేసుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ సేనను ఆండ్రసన్, రాబిన్‌సన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు 1-1తో సమమైంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. లార్డ్స్‌లో ఎదురైన ఓటమికి ప్రతికారం తీర్చుకున్నట్టుగానే మొదటి నుంచి ఆడింది ఆతిథ్య టీం. భారత్‌లో ఎక్కడా దానికి సరిపడా కసి కనిపించలేదు.
215/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాల్గో రోజు ఆట స్టార్ట్ చేసిన కోహ్లీ సేన ఎక్కడా పోరాట పటిమను చూపలేకపోయింది. తొలుత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషణలు వినిపించినా ఎక్కడా ఆ స్థాయి ప్రతిఘటన కనిపించలేదు. తొలి బంతి నుంచి ఇంగ్లీష్ టీం ఆధిపత్యం కనిపించింది.
మొదటి మూడు ఓవర్లు పరుగులు ఏమీ చేయకపోయినా పుజారా, కోహ్లీ సేన ఇంగ్లీష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటారనే ఆశ కల్పించారు. 83 ఓవర్లోనే అసలు ఆట ఇంగ్లండ్ స్టార్ట్ చేసింది. అద్భుతమైన బాల్‌తో పుజారాను బోల్తా కొట్టించిన రాబిన్సన్.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 91 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన పుజారా సెంచరీ చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ అందర్నీ నిరాశపరుస్తూ వెనుదిరిగాడు.
తర్వాత కోహ్లీకి రహానే జత కలిశాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో పోర్లు కొట్టి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు రహానే. అదే జోష్ కోహ్లీలో కూడా కనిపించింది. 45 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఫోర్త్ డే ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ.. రాబిన్సన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత బంతికే రూట్ చేతికి చిక్కాడు. మొదటి నుంచి ఇబ్బంది పడుతున్న బంతులకే కోహ్లీ బోల్తాపడ్డాడు.
కీలకమైన రెండు వికెట్లు కోల్పోయిన టైంలో రహానే, పంత్ ఆదుకుంటారేమో అనుకున్నారంతా. కానీ కోహ్లీ ఔటైన తర్వాత ఓవర్‌లోనే రహానే వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో టెస్టుల్లో ఆండ్రసన్ నాలుగు వందలు వికెట్లు తీశాడు. స్వదేశంలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మురళీధరన్ మాత్రమే 493 వికెట్లతో తొలి ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఆండ్రసన్, కుంబ్లే, బ్రాడ్ ఉన్నారు. ఇక అక్కడి నుంచి భారత్ వికెట్లి పతనం ఆగలేదు ప్రతి ఓవర్లో వికెట్ పడుతూ వచ్చింది.
ఇక అక్కడి నుంచి భారత్ వికెట్ల పతనం ఆగలేదు వికెట్లు పడుతూ వచ్చాయి. రాబిన్ సన్ వేసిన బంతితో స్లిప్ లో ఉన్న క్రేగ్ ఓవర్టన్ చేతికి చిక్కి ఔటయ్యాడు పంత్. ఆ తర్వాత ఇషాంట్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. రాబిన్సన్ వేసిన ఓవర్లలో వికెట్ల వెనక కీపర్ కు చిక్కాడు. దీంతో 257 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజాకు తోడుగా బుమ్రా వచ్చాడు. అయితే ఈ సమయంలో జడ్డూ చేలరేగిపోయాడు. మెుయిన్ అలీ వేసిన 96.4 ఓవర్ కు సిక్స్ బాదాడు. అనంతరం ఓవర్టన్ వేసిన ఓవర్ లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే అనంతరం బట్లర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సిరాజ్ ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడు. దీంతో కోహ్లీ సేన ఇన్నింగ్స్ ముగిసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రాబిన్‌సన్ ఐదు వికెట్లు పడగొడితే.. ఆండ్రసన్ ఒకటి, ఓవర్‌టన్ మూడు, మొయిన్ అలీ ఒక వికెట్ తీశారు.