Jasmine Lamboriya Won Gold: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా
Indian boxer Jasmine Lamboriya | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా స్వర్ణం గెలిచింది. ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత అయిన పోలాండ్ క్రీడాకారిణిని ఓడించింది.

Who Is Jasmine Lamboriya | వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత మహిళా బాక్సర్ స్వర్ణ పతకం సాధించింది. లివర్ పూల్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో జాస్మిన్ లంబోరియా అద్భుతం చేసింది. ఆమె 57 కిలోల విభాగంలో పోలాండ్‌కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయంతో చరిత్ర సృష్టించింది. పోలాండ్‌కు చెందిన ఈ క్రీడాకారిణి పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం గెలుచుకుందని తెలిసిందే. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన బాక్సర్‌పై విజయం సాధించడం అంటే మాటలు కాదు.
తొలి రౌండ్‌లో వెనుకబడిన అద్భుతంగా పుంజుకుని..
ఫైనల్ విషయానికి వస్తే జాస్మిన్ లంబోరియా మొదటి రౌండ్‌లో వెనుకబడింది. కానీ రెండవ రౌండ్‌లో అద్భుతంగా పుంజుకుంది. పోలాండ్‌కు చెందిన బాక్సర్ జూలియాను 4-1 తేడాతో ఓడించి జాస్మిన్ స్వర్ణ పతకం సాధించింది. బాక్సర్ల కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఆటను వారసత్వంగా తీసుకోవడం మాత్రమే కాదు, స్వర్ణ పతకం సాధించి వారు గర్వపడేలా చేసింది. యావత్ భారతావని లంబోరియా సాధించిన విజయంపై ప్రశింసిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పతకం లేకుండానే పురుషుల టీం బాక్సర్లు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత్‌కు చెందిన పురుష బాక్సర్లు ఏ పతకం సాధించలేదు. గత 12 ఏళ్లలో మొదటిసారిగా పురుష బాక్సర్లు పతకం లేకుండా భారత్ కు తిరిగి వస్తున్నారు. జదుమణి సింగ్‌ను కజకిస్థాన్‌కు చెందిన సంజేర్ తష్కెన్‌బే 4-0 తేడాతో ఓడించాడు. జదుమణి ఓటమితో భారత పురుషుల బృందం పతకం లేకుండా ఖాళీ చేతులతో తిరిగి వస్తుందని ఖరారైంది.
Jasmine Lamboriya clinches Gold at the World Boxing Championship in Liverpool.
— ANI (@ANI) September 14, 2025
Source: Boxinf Federation Of India pic.twitter.com/6o2grqakuz
జాస్మిన్ లంబోరియా ఎవరు?
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన జాస్మిన్ లంబోరియా వయసు 24 సంవత్సరాలు. ఆమె ఆగస్టు 30, 2001న హర్యానాలోని భివానీలో జన్మించింది. లంబోరియా బాక్సర్ల కుటుంబం నుంచి వచ్చింది. కానీ ఒక అమ్మాయికి ఈ క్రీడలో తన కెరీర్‌ను నిర్మించుకోవడం అంత సులభం కాదు. అయితే, ఆమె తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా, ఈ అద్భుత ప్రదర్శనతో తన కుటుంబం, రాష్ట్రంతో పాటు దేశానికి పేరు తెచ్చింది.
జాస్మిన్ ముత్తాత హవా సింగ్ హెవీవెయిట్ బాక్సర్. ఆయన రెండుసార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత. ఆమె తాత కెప్టెన్ చందర్ భాన్ జాస్మిన్ లంబోరియా ఒక రెజ్లర్. జాస్మిన్‌కు ఆమె మేనమామ సందీప్ సింగ్, పర్విందర్ సింగ్ బాక్సింగ్ కోచింగ్ ఇచ్చారు. వీరు కూడా బాక్సింగ్‌లో మాజీ జాతీయ ఛాంపియన్లు.
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం
జాస్మిన్ లంబోరియా ఈ ఏడాది జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ (అస్తానా)లో కూడా స్వర్ణ పతకం సాధించింది. జాస్మిన్ బిర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్, 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. చారిత్రాత్మక, అద్భుతమైన ప్రదర్శన తర్వాత బాక్సర్ జాస్మిన్‌ను భారత సైన్యంలో చేర్చుకున్నారు.






















