![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND Vs SL, 3rd T20: హమ్మయ్య ఇషాన్ కిషన్ సేఫ్! ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ
India vs Sri Lanka, Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. అతడు బాగానే ఉన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మూడో టీ20లో మాత్రం అతడిని ఆడించరని సమాచారం.
![IND Vs SL, 3rd T20: హమ్మయ్య ఇషాన్ కిషన్ సేఫ్! ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ India vs Sri Lanka: Ishan Kishan discharged from hospital but unlikely to play 3rd T20I IND Vs SL, 3rd T20: హమ్మయ్య ఇషాన్ కిషన్ సేఫ్! ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/27/13e6644bfdcb4692bdd563a03a31bd5b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ishan Kishan discharged from hospital: టీమ్‌ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రమాదం ఏమీ లేనప్పటికీ బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలనలో ఉంచారని తెలిసింది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శ్రీలంకతో మూడో టీ20లో అతడిని ఆడించరని సమాచారం. అతడి స్థానంలో సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు!
ధర్మశాల వేదికగా శనివారం టీమ్‌ఇండియా, శ్రీలంక రెండో టీ20లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు 183/5 పరుగులు చేశారు. ఛేదనలో రోహిత్ శర్మ (1) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (16; 15 బంతుల్లో 2x4) మరీ ఎక్కువ పరుగులు చేయలేదు. నాలుగో ఓవర్లో లాహిరు కుమార 146 కిలోమీటర్ల వేగంతో వేసిన బౌన్సర్ ఇషాన్ కిషన్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు రావాలని ఫిజియో సూచించినా అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. మరికాసేపటికే ఔటయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే చికిత్స కోసం ఇషాన్ కిషన్‌ను కాంగ్రాలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి సీటీ స్కాన్ చేయించారు. ముందు జాగ్రత్తగా సాధారణ వార్డులో అడ్మింట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు.
హిట్‌మ్యాన్ సేన ఆదివారం లంకేయులతో మూడో టీ20లో తలపడనుంది. బహుశా ఈ మ్యాచులో కిషన్‌ను ఆడించరని తెలుస్తోంది. అతడి స్థానంలో సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేయడం ఖాయమే అంటున్నారు. శనివారం నాటి పోరులో సంజూ అద్భుతంగా ఆడాడు. 13వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదేసి గెలుపును టీమ్‌ఇండియా వైపు మళ్లించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సైతం గాయపడ్డాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ నేడు ఓపెనింగ్ చేస్తాడని సమాచారం.
Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు. ఇప్పటికే 2-0తో సిరీసు గెలిచిన టీమ్‌ఇండియా ఆఖరి మ్యాచ్ గెలిచి లంకను క్లీన్‌స్వీప్ చేయాలని అనుకుంటోంది.
11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls
— BCCI (@BCCI) February 26, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)