IND vs SL, Hanuma Vihari: లంకేయులపై హైదరాబాదీ క్రికెటర్ ఆటకు క్రికెట్ లెజెండ్ ఫిదా!
Hanuma Vihari vs SL: హనుమ విహారి (Hanum Vihari) ఆటతీరుకు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఫిదా అయ్యారు! చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)లా ప్రశాంతత తీసుకొచ్చాడని ప్రశంసించాడు.

Sunil Gavaskar praises Hanuma Vihari: తెలుగు ఆటగాడు హనుమ విహారి (Hanum Vihari) ఆటతీరుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఫిదా అయ్యారు! అచ్చం చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) మాదిరిగానే ప్రశాంతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించారు. బ్యాటుతో చక్కగా స్ట్రెయిట్ షాట్లు కొట్టడం ఆకట్టుకుందని వెల్లడించాడు.
మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (IND vs SL 1st Test) హనుమ విహారి అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) వికెట్ పడగానే క్రీజులోకి వచ్చాడు. 128 బంతులాడి 5 బౌండరీలతో 58 పరుగులు చేశాడు. 45.31 సగటుతో అతడు బ్యాటింగ్ చేయడం గమనార్హం. హనుమ విహారికి భారత్‌లో ఇది రెండో టెస్టు మ్యాచ్. చెతేశ్వర్ పుజారా స్థానంలో దొరికిన అవకాశాన్ని అతడు చక్కగా ఉపయోగించుకున్నాడు. విలువైన పరుగులు సాధించాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు.
'అచ్చం చెతేశ్వర్ పుజారా మాదిరిగానే హనుమ విహారి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు ప్రశాంతతను ఇచ్చాడు. సాధారణంగా పుజారా క్రీజులో ఉంటే మనం సులువుగా ఊపిరి పీల్చుకోవచ్చు. అతనాడే ఎండ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ధీమా ఉంటుంది. హనుమ విహారి నిజంగా ఆకట్టుకున్నాడు. ఒకసారి అతడి బ్యాటు స్ట్రెయిట్‌నెస్ చూడండి. అతడు చేసిన పరుగులన్నీ బ్యాటు ఫుల్‌పేస్‌తోనే చేశాడు. అతనాడుతుంటే డ్రెస్సింగ్ రూమలో అసలు ఆందోళనే లేదు. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు అలావుంది మరి' అని సునిల్ గావస్కర్ అన్నారు.
'విహారి క్రీజులో నిలదొక్కుకోవడానికి తీసుకున్న సమయం చూడండి. చాలా బాగుంది. పిచ్‌లు అత్యంత కఠినంగా ఉండే దక్షిణాఫ్రికాలోనూ అతడు ఆకట్టుకున్నాడు. అప్పట్లో రెండో ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లతో కలిసి అతడు చేసిన విలువైన పరుగులు గుర్తు తెచ్చుకోండి' అని గావస్కర్ పేర్కొన్నారు. శ్రీలంకతో టెస్టు సిరీసుకు ముందు హనుమ విహారి సత్తా చాటాడు. హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. చత్తీస్‌గఢ్‌పై ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాధించాడు. ఇక లంకతో మ్యాచులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి 38, విరాట్ కోహ్లీతో (Virat Kohli) కలిసి 90 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లు ముగిసే సరికి టీమ్‌ఇండియా 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మయాంగ్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29), హనుమ విహారి (58), విరాట్ కోహ్లీ (45), శ్రేయస్ అయ్యర్ (27) ఔటయ్యారు.
Tea on Day 1 of the 1st Test.#TeamIndia 199/4 (Hanuma 58, Virat 45)https://t.co/c2vTOXAx1p #INDvSL @Paytm pic.twitter.com/kNdKZziJi4
— BCCI (@BCCI) March 4, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

