By: ABP Desam | Updated at : 28 Jul 2021 10:00 PM (IST)
India vs Sri Lanka
మెుదట టాస్ ఓడి టీం ఇండియా బ్యాటింగ్ కు దిగింది. ఇండియాకు ధావన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంబాన్ని అందిచారు. 49 పరుగులు ఉన్నప్పుడు 18 బంతుల్లో 21 పరుగులు చేసిన గైక్వాడ్ ఔటయ్యాడు. గబ్బర్ తో కలిసి అరంగేట్ల బ్యాట్స్ మెన్ దేవదత్ పడికల్ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. వీరు దూకుడు పెంచిన టైమ్ లో 40 పరుగులు చేసిన ధావన్ ను ధనుంజయ పెవిలియన్ చేర్చాడు. మరికొద్దిసేపటికే పడిక్కల్ 29 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. సంజూ శాంసన్ (7) విఫలమయ్యాడు. చివర్ లో భువనేశ్వర్ కుమార్(13) దాటిగా ఆడటం వల్ల నిర్ణీత ఓవర్లలో 132 పరుగులు చేసింది టీమ్ఇండియా.
శ్రీలంక బౌలర్లలో అఖిల ధనంజయ 2, హసరంగ, దసున్ శనక, చమీరా చెరో వికెట్ దక్కించుకున్నారు.
తొలి టీ20లో భారత్ విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లతో రాణించారు.
మెుదటి టీ 20లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు.. ఫెర్నాండో- మినోద్ భానుక జోడీ 23 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ జంటను కృనాల్ విడదీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన డిసిల్వా కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. స్కోరు బోర్డులో మరో రెండు పరుగులు కలిశాయో లేదో మరో ఓపెనర్ ఫెర్నాండో భువీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన అసలంక దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి తగిన సహకారం లభించలేదు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ధాటిగా ఆడలేకపోయారు. మెుదటి టీ20లో లంక విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక