IND vs ENG, 1st Innings Highlights: రెండో రోజు ఇంగ్లాండ్‌దే... ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 423/8... తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల భారీ ఆధిక్యం
India vs England, 1st Innings Highlights: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లాండ్‌దే పూర్తి హవా నడిచింది. ఓవర్ నైట్ స్కోరు 120/0 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆచి తూచి ఆడి భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
Stumps on day two!
— ICC (@ICC) August 26, 2021
Joe Root's century has put England in the driver's seat 💪#WTC23 | #ENGvIND | https://t.co/qmnhRc14r1 pic.twitter.com/asACkegYar
జో రూట్ జోరు
భారత్‌తో ఈ టెస్టు సిరీస్‌లో ఆది నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన రూట్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శతకంతో చెలరేగాడు. మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం 124 బంతుల్లోనే జో రూట్ 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో రూట్ కిది మూడో శతకం కావడం గమనార్హం.
Best. Player. In. The. World. ❤️
— England Cricket (@englandcricket) August 26, 2021
100 on his home ground, in front of a full house 🔥
Scorecard & Videos: https://t.co/csDPLXK4GY#ENGvIND pic.twitter.com/3R80KkdmtR
రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్రేగ్ ఓవర్టన్(24; 31 బంతుల్లో 4x4), రాబిన్సన్(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ జోరూట్ (121; 165 బంతుల్లో 14x4), డేవిడ్ మలన్ (70; 128 బంతుల్లో 11x4) భారీ స్కోర్లు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 139 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యాన్ని దక్కించుకోగలిగింది. భారత బౌలర్లలో షమి మూడు.. సిరాజ్, జడేజా చెరో రెండు.. బుమ్రా ఒక వికెట్ తీశారు.
Two quick wickets for India ⚡
— ICC (@ICC) August 26, 2021
Jasprit Bumrah brings an end to Joe Root's wonderful innings. The very next over, Moeen Ali falls to Ravindra Jadeja ☝#WTC23 | #ENGvIND | https://t.co/qmnhRc14r1 pic.twitter.com/yRw2bVDx8d
రెండో రోజు చివరి సెషన్ మినహా భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక మూడో రోజు (శుక్రవారం) ఉదయం వీలైనంత త్వరగా టీమ్ఇండియా ఆ చివరి రెండు వికెట్లను తీయాలి. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్మెన్ ఏ మేరకు ఆడతారో చూడాలి. ఇప్పటికే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ సంపూర్ణ ఆధిక్యంలో నిలిచింది.
6️⃣ Test centuries this year
— England Cricket (@englandcricket) August 26, 2021
3️⃣ hundreds in this series
A batting genius @root66 🤩
Scorecard/Clips: https://t.co/UakxjzUrcE@IGcom 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/v3zCKCnc1s