News
News
X

Ind vs Eng 1st Test: టీ విరామానికి భారత్​ 125/4.. వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

భారత్-ఇంగ్లాండ్ తొలిటెస్టు.. రెండోరోజు మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. రెండో సెష‌న్‌లో వెలుతురు తగ్గడంతోపాటు వ‌ర్షం కురవ‌డంతో అంపైర్లు పరిశీలించి.. మ్యాచ్‌ను నిలిపివేశారు.

FOLLOW US: 

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు టీ బ్రేక్​ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్​ను నిలిపివేశారు.

రెండో రోజు ఆట ఆరంభంలో టీమ్​ఇండియా బాగా ఆడినా.. చివర్లో ఇంగ్లాండ్​ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా టీ బ్రేక్​ సమయానికి భారత జట్టు 46.1 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్​ రాహుల్​(57), పంత్ ​(7) ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 58 పరుగుల వెనకంజలో ఉంది.
 
21/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో భారత్ బరిలోకి దిగింది. టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్​(36), రాహుల్​ నిలకడగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్​ శర్మకు(36) సామ్​కరన్​​ అడ్డుకట్ట వేశాడు. ఫలితంగా 97 పరుగుల తొలి వికెట్​ భాగస్వామ్యానికి తెరపడింది. భోజన విరామానికి ముందు 97/1తో ఉన్న భారత జట్టు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్‌ కోహ్లీ(0), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) ఔటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే రాహుల్‌, పంత్‌ నిలకడగా ఆడారు. జట్టు స్కోరును గాడిలో పెడుతున్నారు. ఈ సమయంలోనే వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు.

టీమ్‌ఇండియా రెండో సెషన్‌లో 46.1 ఓవర్ల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. కాసేపటికే వర్షం కురిసింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో రోజు టీ బ్రేక్తీ సుకుంది. తర్వాత వర్షం కురవడం ఆగిపోయి వెలుతురు బాగా ఉండటంతో అంపైర్లు మూడో సెషన్‌ ప్రారంభించారు. కానీ ఒక్క బంతి పడగానే మళ్లీ వర్షం అందుకుంది. రెండోసారి కూడా ఆపేశారు. కాసేపటికే వర్షం నిలిచిపోవడంతో మళ్లీ కొనసాగించారు. ఆపై అండర్సన్‌ మరో రెండు బంతులు వేయగానే వరుణుడు మూడోసారి అడ్డుపడటంతో మరోసారి నిలిపివేశారు. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(4/46) షమి(3/28 ), శార్దూల్​(2/41), సిరాజ్​(1/48) బౌలింగ్ తో దుమ్ములేపారు. ఇంగ్లాండ్​ జట్టులో కెప్టెన్​ జో రూట్​(64) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా 13 ఓవర్లు ఆడి 21/0 తొలి రోజు ఆటను ముగించిన విషయం తెలిసిందే.

Published at : 05 Aug 2021 06:55 PM (IST) Tags: Siraj TeamIndia Bumrah cricket team ENGvIND Kohli JoeRoot India vs England 1st Test India vs England 1st Test live score Indian Cricket Team Trent Bridge stadium England

సంబంధిత కథనాలు

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

Boycott Laal Singh Chaddha: ఫ్లాఫైనా వదల్లేదు! లాల్‌సింగ్‌ చడ్డాను నిషేధించాలని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ డిమాండ్‌

Boycott Laal Singh Chaddha: ఫ్లాఫైనా వదల్లేదు! లాల్‌సింగ్‌ చడ్డాను నిషేధించాలని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ డిమాండ్‌

T20 World Cup 2022: ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! బుమ్రా పరిస్థితేమీ బాగా లేదట!

T20 World Cup 2022: ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! బుమ్రా పరిస్థితేమీ బాగా లేదట!

Urvashi Rautela On Pant : రిషబ్ పంత్ పిల్ల బచ్చా - టీమిండియా కీపర్‌పై ఊర్వశి రౌటేలా సెటైర్స్

Urvashi Rautela On Pant : రిషబ్ పంత్ పిల్ల బచ్చా - టీమిండియా కీపర్‌పై ఊర్వశి రౌటేలా సెటైర్స్

టాప్ స్టోరీస్

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి