అన్వేషించండి

Under 19 World Cup : ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్‌

అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో గురువారం రాత్రి వరకు జరిగిన మ్యాచ్‌ భారత్‌ జట్టు ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది.

Under-19 World Cup : దక్షిణాప్రికా(South Africa) వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌(Under 19 World Cup)లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పసికూన ఐర్లాండ్‌(Irland )తో గురువారం రాత్రి వరకు జరిగిన మ్యాచ్‌ భారత్‌ జట్టు(Team India) ఘన విజయం సాధించింది. మౌంగాంగ్‌ ఓవల్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు ఏడు వికెట్ల నష్టాన్ని 301 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఐర్లాండ్‌ జట్టు తడబాటుకు గురై 29.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 201 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో వరుసగా వరల్డ్‌ కప్‌లో రెండో విజయాన్ని భారత్‌ జట్టు నమోదు చేసినట్టు అయింది. బంగ్లాదేశ్‌పై మొదటి విజయాన్ని భారత్‌ జట్టు నమోదు చేసింది. తరువాత మ్యాచ్‌లను భారత్‌ జట్టు అమెరికాతో ఆడనుంది. 

సెంచరీతో చెలరేగిన ఖాన్‌

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ టాపార్డర్‌ రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు ఏ సింగ్‌(Adarsh Singh) 17(33), ఏ కులకర్ణి 32(55) రాణించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్‌ ఎం ఖాన్‌ (Musheer Khan )చెలరేగిపోవడంతో భారత్‌ భారీ స్కోర్‌కు బాటలు పడ్డాయి. 106 బంతుల్లో నాలుగు సిక్సులు, తొమ్మిది ఫోర్ల సహాయంతో ఎం ఖాన్‌ 118 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్‌ యు సహరాన్‌ అద్భుతమైన సహకారాన్ని అందించాడు. 84 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 75 పరుగులు చేసి సహరాన్‌ కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడి జట్టుకు భారీ స్కోరును అందించిపెట్టాడు. ఆ తరువాత వచ్చిన వికెట్‌ కీపర్‌ ఏఏ రావు 13 బంతుల్లో 22, ఎస్‌ దాస్‌ తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్‌, రెండు ఫోర్ల సహాయంతో 21 పరుగులు చేయడంతో భారత్‌ జట్టు ఏడు వికెట్ల నష్టాన్ని 301 పరుగులు చేయగలిగింది. ఐర్లాండ్‌ బౌలర్లలో ఓసీ రియల్లీ మూడు వికెట్ల తీయగా, జే మెక్‌నాల్లీ రెండు, ఎఫ్‌ లూటన్‌ ఒక వికెట్‌ తీశారు. 

తడబడిన ఐర్లాండ్‌ జట్టు

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ జట్టు ఏ దశలోనూ లక్ష్యంగా దిశగా పయనించినట్టు కనిపించలేదు. భారత బౌలర్లు ఐర్లాండ్‌ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో నామమాత్రపు స్కోర్‌ చేయడానికి కూడా ఐర్లాండ్‌ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్‌ బౌలర్ల ధాటికి నలుగురు ఐర్లాండ్‌ బ్యాటర్లు మాత్రమే నాలుగు అంకెల స్కోర్లు చేశారు. ఐర్లాండ్‌ టాపార్డర్‌లో జె నెల్లి 19 బంతుల్లో 11 పరుగులు, వికెట్‌ కీపర్‌ ఆర్‌ హంటర్‌ 24 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు. ఓసీ రియల్లీ 26 బంతుల్లో 15 పరుగులు, డి ఫార్కిన్‌ 40 బంతుల్లో 27 పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో ఎన్‌ తివారీ నాలుగు వికెట్లతో ఐర్లాండ్‌ జట్టు నడ్డి విరిచాడు. ఎస్‌కే పాండే మూడు వికెట్లు తీయగా, డి గౌడ, ఎంపీ అభిషేక్‌, యు సహరాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. తాజా విజయంతో భారత్‌ జట్టు ఏ గ్రూప్‌లో రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget