News
News
X

IND vs WI, 2nd T20I: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌! 2 గంటలు ఆలస్యంగా రెండో టీ20 ఆరంభం

IND vs WI, 2nd T20I: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌! భారత్‌, వెస్టిండీస్ రెండో టీ20 మరో రెండు గంటలు ఆలస్యం కానుంది.

FOLLOW US: 

IND vs WI 2nd T20I: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌! భారత్‌, వెస్టిండీస్ రెండో టీ20 మరో రెండు గంటలు ఆలస్యం కానుంది. లగేజీ పరమైన ఇబ్బందులతో మ్యాచ్‌ను ఆలస్యంగా ఆరంభిస్తామని క్రికెట్‌ వెస్టిండీస్‌ తెలిపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన పోరు రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.

'పరిస్థితులు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు నియంత్రణ దాటిపోయాయి. జట్లకు అవసరమైన ముఖ్యమైన లగేజీ ట్రినిడాడ్‌ నుంచి సెయింట్‌ కీట్స్‌కు ఆలస్యంగా వస్తోంది. ఫలితంగా రెండో టీ20 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారత్‌లో రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. అభిమానులు, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వాములకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. స్టేడియం గేట్లు 10 గంటలకు తెరుస్తారు. టికెట్లు అందుబాటులో ఉన్నాయి' అని క్రికెట్‌ వెస్టిండీస్‌ తెలిపింది.

వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటిస్తే బ్రాడ్‌కాస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపించరు. ఇక్కడి, అక్కడి సమయానికి చాలా తేడా ఉండటమే కారణం. అక్కడ ఉదయం జరిగితేనే ఇక్కడ రాత్రి అవుతుంది. అందుకే స్టార్‌ స్పోర్ట్స్‌, సోనీ ఛానెళ్లు బిడ్డింగ్‌ వేయలేదు. దాంతో దూరదర్శన్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ ఇస్తున్నారు. ఫ్యాన్‌కోడ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ వస్తోంది.

లో స్కోరింగ్‌ పిచ్‌

రెండో టీ20 వార్నర్‌ పార్క్‌లో జరుగుతుంది. ఈ స్టేడియంలోనూ స్కోరు తక్కువే నమోదవుతుంది. పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది. 2019లో విండీస్‌ ఇక్కడే అత్యల్ప స్కోరు 45కు ఆలౌటైంది. వాతావరణం ప్రశాంతంగానే ఉంటుందని సమాచారం.

IND vs WI 2nd T20 probable XI

భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ / హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

వెస్టిండీస్‌: కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, జేసన్ హోల్డర్‌, రోమన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రొమారియో షెఫర్డ్‌, అకేల్‌ హుస్సేన్‌, కీమోపాల్‌ / హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెకాయ్‌

Published at : 01 Aug 2022 06:13 PM (IST) Tags: Rohit Sharma India vs West Indies IND vs WI Nicholas Pooran India tour of West Indies IND vs WI 2nd T20 preview

సంబంధిత కథనాలు

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!