Yuvraj Singh: వన్డే క్రికెట్ చచ్చిపోతుందా - యువరాజ్ ఆవేదన - ఇర్పాన్ పఠాన్ ఏమన్నాడంటే?
భారత్, శ్రీలంక మూడో వన్డేకు అభిమానులు తక్కువ సంఖ్యలో హాజరవడంపై యువరాజ్ ట్వీట్ చేశాడు.
Yuvraj Singh: భారత్-శ్రీలంక మధ్య జరిగిన వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. భారత్ తరఫున ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేశాడు. అదే సమయంలో ఈ మ్యాచ్‌ని చూసేందుకు కొద్ది సంఖ్యలో మాత్రమే అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు.
వన్డే క్రికెట్ చచ్చిపోతుందా?
తిరువనంతపురం వన్డే మ్యాచ్‌ని చూసేందుకు కొద్ది సంఖ్యలో మాత్రమే అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులకు మూడో మ్యాచ్‌పై ఆసక్తి తగ్గిపోయింది. ఈ కారణంగా తక్కువగా స్టేడియంకు చేరుకున్నారు.
అదే సమయంలో టిక్కెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ మ్యాచ్‌లో అభిమానుల సంఖ్య తక్కువగా ఉండటం చూసి భారత మాజీ వెటరన్ యువరాజ్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్ ముగిసిపోతోందా అని ట్వీట్ చేశాడు.
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై, ఇర్ఫాన్ పఠాన్ రిప్లై ఇచ్చాడు. ‘పాజీ మీరు మైదానానికి తిరిగి రండి. అభిమానులు కూడా తిరిగి వస్తారు’ అని బదులిచ్చారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. అదే సమయంలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లపై యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించారని, అయితే స్టేడియం దాదాపు సగం ఖాళీగా ఉండటం తనను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ ముగింపు దశకు చేరుతోందా? యువరాజ్ సింగ్ ట్వీట్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
Well played @ShubmanGill hopefully goes on to make a 💯 @imVkohli batting at the other end looking Solid ! But concern for me half empty stadium ? Is one day cricket dying ? #IndiavsSrilanka
— Yuvraj Singh (@YUVSTRONG12) January 15, 2023
Bhai pads pehan lo. Aajegi jantaaa
— Irfan Pathan (@IrfanPathan) January 15, 2023
View this post on Instagram