News
News
X

IND Vs SL: శ్రీలంకను చితక్కొట్టిన టీమిండియా - మూడో టీ20లో ఘనవిజయం - సిరీస్ కూడా సొంతం!

నిర్ణయాత్మక మూడో టీ20 టీమిండియా 91 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది.

FOLLOW US: 
Share:

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు)శతకంతో అజేయంగా నిలిచాడు. అనంతరం శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా సిరీస్‌ను కూడా 2-1తో గెలుచుకుంది.

229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు యావరేజ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు పతుం నిశ్శంక (15: 17 బంతుల్లో, మూడు ఫోర్లు), కుశాల్ మెండిస్ (23: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే ఏడు పరుగుల వ్యవధిలోనే భారత బౌలర్లు చెలరేగి మూడు వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా శ్రీలంకను భారత బౌలర్లు కోలుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ శ్రీలంకను ఆలౌట్ చేశారు.

లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మలిక్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ మధుశంక బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గిల్ నెమ్మదిగా ఆడటంతో ఆ తర్వాత 2 ఓవర్లలో ఎక్కువ పరుగులు రాలేదు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే 2 బౌండరీలు కొట్టిన రాహుల్.. చమిక కరుణరత్నే వేసిన 6వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అతను ఔటయ్యాడు. పవర్ ప్లే అయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 52 పరుగులు చేసింది. 

ఆ తర్వాత ఇంక అంతా సూర్య ప్రతాపమే. వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టిన సూర్యకుమార్ ఎక్కడా తగ్గలేదు. తన ఇన్నింగ్స్ అంతటా హిట్టింగే హిట్టింగ్. బౌలర్ ఎవరైనా బాదడం మాత్రం ఆపలేదు సూర్య. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన స్కై సెంచరీతో చెలరేగాడు. 25 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ మహీశ్ థీక్షణ వేసిన 14వ ఓవర్లో విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6 బాదాడు. గిల్ కూడా ఒక ఫోర్ సాధించటంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అనంతరం హసరంగ బౌలింగ్ లో గిల్ బౌల్డయ్యాడు.

గిల్, సూర్య మూడో వికెట్ కు 111 పరుగులు జోడించారు. అనంతరం జోరు పెంచిన సూర్య 41 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు.  51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధ్యలో హార్దిక్ పాండ్య (4), దీపక్ హుడా (4) అలా వచ్చి ఇలా వెళ్లారు.  చివర్లో అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21) వేగంగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీసుకున్నాడు. రజిత, కరుణరత్నే, హసరంగా తలా వికెట్ దక్కించుకున్నారు.

Published at : 07 Jan 2023 10:23 PM (IST) Tags: Hardik Pandya IND vs SL IND VS SL highlights IND Vs SL 3rd T20I IND Vs SL 3rd T20I Highlights

సంబంధిత కథనాలు

IND vs AUS: రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ - ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది? - ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు?

IND vs AUS: రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ - ఎవరి రికార్డు మెరుగ్గా ఉంది? - ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు?

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

IND Vs AUS: నాగ్‌పూర్‌లో 14 ఏళ్ల క్రితం తలపడ్డ భారత్, ఆస్ట్రేలియా - ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది?

IND Vs AUS: నాగ్‌పూర్‌లో 14 ఏళ్ల క్రితం తలపడ్డ భారత్, ఆస్ట్రేలియా - ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది?

Mahendra Singh Dhoni: ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ధోని ఎఫెక్ట్ - సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

Mahendra Singh Dhoni: ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై ధోని ఎఫెక్ట్ - సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

Kohli vs Lyon: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికర పోరు - విరాట్‌కు సవాలు విసిరేది అతనొక్కడే?

Kohli vs Lyon: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికర పోరు - విరాట్‌కు సవాలు విసిరేది అతనొక్కడే?

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!