By: ABP Desam | Updated at : 23 Feb 2022 01:30 PM (IST)
Edited By: Ramakrishna Paladi
IND-vs-SL @ BCCI twitter
IND vs SL 1st T20: వెస్టిండీస్ సిరీస్ ముగిసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే టీమ్‌ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంక జట్టుతో మూడు టీ20ల సిరీసు ఆడనుంది. ఫిబ్రవరి 24న ఈ రెండు జట్లు మొదటి మ్యాచులో తలపడనున్నాయి. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మిగిలిన రెండు టీ20లు ధర్మశాలలోని హెచ్‌పీసీఎస్ మైదానంలో జరుగుతాయి.
When and where will the Ind vs SL 1st T20I match be played?
చివరి సారిగా భారత్, శ్రీలంక 2021, జులైలో తలపడ్డాయి. గతేడాది టీమ్‌ఇండియా పరిమితి ఓవర్ల సిరీసు కోసం శ్రీలంకలో పర్యటించింది. వన్డే సిరీసును టీమ్‌ఇండియా 2-1తో గెలవగా టీ20 సిరీసును లంకేయులు 2-1తో కైవసం చేసుకున్నారు. ఈ సిరీసు సమయంలో టీమ్‌ఇండియా ద్వితీయ శ్రేణి జట్టును లంకకు పంపించింది. అయితే అందులో కొందరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో రిజర్వు బెంచీ ఆటగాళ్లతో మ్యాచులు ఆడించారు.
When will the Ind vs SL 1st T20 match start?
భారత్, శ్రీలంక మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 24న, గురువారం జరుగుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఈ పోరుకు ఆతిథ్యం ఇస్తోంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేస్తారు. 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to watch the live streaming and telecast of Ind vs SL 1st T20I?
భారత్, శ్రీలంక క్రికెట్ సిరీసు మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తోంది. మ్యాచులను ఆ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. మ్యాచుకు సంబంధించిన అప్‌డేట్లు, వార్తలకు ABPLive.com, ABPDesam.comకు లాగిన్ అవ్వండి.
టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్.
శ్రీలంక టీ20 జట్టు: దసున్ శనక, చరిత్ అసలంక, పాథుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిశారా, జనిత్ లియనాగ్, వనింద్ హసరంగ, చామిక కరుణరత్నె, లాహిరు కుమార, ధుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీశ్ థీక్షణ
Sri Lanka T20I squad for India tour 2022 - https://t.co/SofZ6k22gC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 21, 2022
⬇️#INDvSL pic.twitter.com/Pfj3TTehOg
Touchdown Lucknow📍#TeamIndia arrive in Lucknow for the 1st @Paytm #INDvSL T20I 👍 pic.twitter.com/jm5ceNUjQB
— BCCI (@BCCI) February 21, 2022
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!