IND vs SCO, T20 Live: 6.3 ఓవర్లలో ముగిసేసరికి భారత్ స్కోరు 89-2, ఎనిమిది వికెట్లతో విజయం
ICC T20 WC 2021, IND vs SCO: టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో భారత్, స్కాట్లాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ నేడు స్కాట్లాండ్‌తో తలపడనుంది. సెమీస్ బరిలో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. స్కాట్లాండ్ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు దాదాపు షాకిచ్చినంత పని చేసింది కాబట్టి వాళ్లని తక్కువ అంచనా వేయకూడదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం అయిన భారత్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌కు దిగిన నలుగురు బ్యాట్స్‌మెన్(రోహిత్, రాహుల్, పాండ్యా, పంత్) అద్భుతంగా ఆడారు. బౌలర్లు కూడా బలమైన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెను కట్టడి చేశారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో ఫాంలోకి వచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 140 పరుగులు జోడించి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. వారి తర్వాత వచ్చిన పంత్, పాండ్యా కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. వీరు నాలుగో వికెట్‌కు 22 బంతుల్లోనే 63 పరుగులు జోడించడంతో భారత్ 210 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేసి కట్టడి చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో తన విలువను ప్రదర్శించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడటంతో.. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు ఆరు పాయింట్లతో మన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంపై దృష్టి పెట్టాలి.
ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్.. నమీబియాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో వారి నెట్ రన్‌రేట్ కూడా మెరుగైంది. కాబట్టి సెమీస్ వైపు మరో ముందడుగు వేశారు. తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. న్యూజిలాండ్ సెమీస్ బర్త్ కన్ఫర్మ్ అయినట్లే. ఒకవేళ ఓడిపోతే మాత్రం మిగతా మ్యాచ్‌ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం నమీబియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 111 పరుగులకే పరిమితం అయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
6.3 ఓవర్లలో ముగిసేసరికి భారత్ స్కోరు 89-2, ఎనిమిది వికెట్లతో భారత్ విజయం
గ్రీవ్స్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. ఈ విజయం భారత్ నెట్‌రన్‌రేట్ +1.619కు చేరుకుంది. గ్రూప్-2లో ఇదే అత్యధిక నెట్‌రన్‌రేట్.
విరాట్ కోహ్లీ 2(2)
సూర్యకుమార్ యాదవ్ 6(2)
గ్రీవ్స్ 0.3-0-7-0
6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 82-2, లక్ష్యం 86 పరుగులు
వాట్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. విజయానికి 84 బంతుల్లో 4 పరుగులు కావాలి.
విరాట్ కోహ్లీ 1(1)
సూర్యకుమార్ యాదవ్ 0(0)
వాట్ 2-0-20-1
కేఎల్ రాహుల్ (సి) మాక్‌లియోడ్ (బి) వాట్ (50: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు)
ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 70-1, లక్ష్యం 86 పరుగులు
వీల్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు. విజయానికి 90 బంతుల్లో 16 పరుగులు కావాలి.
విరాట్ కోహ్లీ 0(0)
కేఎల్ రాహుల్ 39(14)
వీల్ 2-0-32-1
రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) వీల్ (30: 16 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)
నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 53-0, లక్ష్యం 86 పరుగులు
షరీఫ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. విజయానికి 96 బంతుల్లో 33 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 26(14)
కేఎల్ రాహుల్ 26(10)
షరీఫ్ 1-0-14-0
మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 39-0, లక్ష్యం 86 పరుగులు
ఇవాన్స్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. విజయానికి 102 బంతుల్లో 47 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 12(8)
కేఎల్ రాహుల్ 26(10)
ఇవాన్స్ 1-0-16-0