By: ABP Desam | Updated at : 05 Jan 2022 12:36 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రిషభ్ పంత్
టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా వంద క్యాచుల రికార్డు అందుకున్నాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, సయ్యద్ కిర్మాణి, కిరణ్ మోరె వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో అతడీ ఘనత సాధించాడు.
Another Test, another milestone for #RP17 💙
— Delhi Capitals (@DelhiCapitals) January 4, 2022
He becomes just the 4⃣th 🇮🇳 wicket-keeper to 💯 Test catches 🧤 #SAvIND pic.twitter.com/YSmRLiZ1wE
కేవలం 24 ఏళ్ల వయసులోనే పంత్ ఈ రికార్డు అందుకోవడం ప్రత్యేకం. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ బౌలింగ్‌లో సఫారీ ఆటగాడు లుంగి ఎంగిడి క్యాచ్ అందుకోవడంతో ఈ మైలురాయికి చేరుకున్నాడు. మొత్తంగా టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్లో వంద క్యాచులు అందుకున్న నాలుగో వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోనీ (256), సయ్యద్ కిర్మాణి (160), కిరణ్ మోరె (110) సరసన నిలిచాడు. ఇక అంతర్జాతీయంగా ఈ ఘనత అందుకున్న 42వ వికెట్‌కీపర్‌గానూ తన పేరు లిఖించాడు.
వంద క్యాచుల ఘనత అందుకోవడానికి రిషభ్ పంత్ 26 టెస్టులు, 50 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎంఎస్ ధోనీ, వృద్ధిమాన్ సాహా 36 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు. మరోవైపు రెండో టెస్టులో యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దక్షిణాఫ్రికాలో ఏడు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్గా అవతరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.
STUMPS, DAY 2️⃣
— Delhi Capitals (@DelhiCapitals) January 4, 2022
The Proteas got our openers out early, but Rahane-Pujara have done well to add some vital runs late in the day 👊🏼
What would be a good target on this wicket❓
🇮🇳 - 85/2 (20), lead by 58 runs#SAvIND pic.twitter.com/SFd2Er3lm7
రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం, రెండోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. అజింక్య రహానే (11 బ్యాటింగ్: 22 బంతుల్లో, ఒక ఫోర్), చెతేశ్వర్ పుజారా (35 బ్యాటింగ్: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగలిగింది. దీంతో ఆతిథ్య జట్టుకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 200+ పరుగులు చేస్తే టీమ్‌ఇండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి.
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!
Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ ప్రమోషన్! ఐర్లాండ్ టూర్లో టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ!!
Rajat Patidar: 'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?