Ind vs NZ 1st T20 Live: 19.4 ఓవర్లలో ముగిసేసరికి భారత్ స్కోరు 166-5, ఐదు వికెట్ల టీమిండియా విజయం
Ind vs NZ 1st T20 International, Jaipur: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది.
LIVE
Background
ప్రపంచకప్ ముగిసి వారమైనా కాలేదు మళ్లీ టీ20 క్రికెట్ మొదలయిపోయింది. ప్రియమైన శత్రువు న్యూజిలాండ్ మన దేశంలో పర్యటిస్తోంది. మూడు మ్యాచుల్లో భాగంగా తొలి టీ20ని జైపుర్ సవాయ్ మాన్‌సింగ్ మైదానంలో ఆడుతోంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ టీమ్‌ఇండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా మొదటి సిరీస్ ఆడుతున్నారు. వ్యక్తిగా, క్రికెటర్‌గా, కోచ్‌గా ద్రవిడ్‌కు మంచి పేరుంది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్‌కు అనుభవం ఉంది. మరో 11 నెలల్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ఇది అంకురార్పణ!
టీ20ల్లో ఈ రెండు జట్లు 17 సార్లు తలపడ్డాయి. కివీస్ 9 మ్యాచులు గెలిచింది. భారత్ 6 గెలిచింది. రెండింట్లో ఫలితం తేలలేదు. ఉపఖండంలో మాత్రం టీమ్‌ఇండియాదే పైచేయి.
భారత్ బలాలు ఇవే..
రోహిత్ శర్మ కెప్టెన్ కావడం. ద్రవిడ్ కోచ్‌గా రావడం.
కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటం.
వెంకటేశ్ అయ్యర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హార్దిక్ పాండ్య స్థానాన్ని అతడి భర్తీ చేయనున్నాడు.
ఫియర్‌లెస్ క్రికెట్ వైపు అడుగులు వేస్తామని ద్రవిడ్ ప్రకటించడం.
రాహుల్, రోహిత్ ఓపెనింగ్ భాగస్వామ్యం.
సూర్య, శ్రేయస్, ఇషాన్, రుతురాజ్, పంత్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటం.
భువీ, అక్షర్, సిరాజ్, యూజీ, అశ్విన్‌తో బౌలింగ్ బలంగా ఉండటం.
సొంత దేశంలో ఆడుతుండటం.
భారత్ బలహీనతలు ఇవే..
విరాట్ కోహ్లీ, బుమ్రా, షమి అందుబాటులో లేకపోవడం.
కుర్రాళ్లు, సీనియర్లతో కూర్పు సులువు కాదు.
మొదట బ్యాటింగ్‌లో తక్కువ స్కోరు చేయడం.
చాలామందిపై బుడగ ఒత్తిడి ఉండటం.
కుర్రాళ్లు ఒత్తిడిని ఏ మేరకు అధిగమిస్తారో తెలియదు.
ఐపీఎల్ నుంచి నేరుగా ఎంపికవ్వడం.
కివీస్ ఎలా ఉందంటే?
ఇక న్యూజిలాండ్ పరిస్థితీ టీమ్‌ఇండియాలాగే ఉంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరికీ భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. కీపర్ టిమ్ సీఫెర్ట్‌కు టీమ్‌ఇండియాపై మంచి సగటు ఉంది. గప్తిల్‌కూ మన బౌలర్లపై ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌ను బాగా ఎదుర్కొనే డేవాన్ కాన్వే లేకపోవడం కివీస్ లోటు. సమష్టిగా ఆడటం కివీస్ బలం. కొన్నేళ్లుగా ఆ జట్టుకు రెగ్యులర్‌గా 20-25 మందిని ఆడిస్తోంది. జిమ్మీ నీషమ్, శాంట్నర్, సౌథీ, ఫెర్గూసన్, సోధికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది.
మంచు కీలకం?
పిచ్ బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. పెద్ద మైదానం కావడంతో స్పిన్నర్లు వికెట్లు తీసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ల కన్నా స్పిన్నర్ల సగటు, ఎకానమీ మెరుగ్గా ఉంది. పేసర్లు చక్కని బంతులు వేసేందుకు పరిస్థితులు బాగుంటాయి. ఎడారి ప్రాంతం కావడంతో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
19.4 ఓవర్లలో ముగిసేసరికి భారత్ స్కోరు 166-5, ఐదు వికెట్ల టీమిండియా విజయం
డేరిల్ మిషెల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఐదు వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించింది.
రిషబ్ పంత్ 12(14)
అక్షర్ పటేల్ 1(1)
డేరిల్ మిషెల్ 0.4-0-11-1
వెంకటేష్ అయ్యర్ (సి) రవీంద్ర (బి) డేరిల్ మిషెల్ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్)
19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 155-4, లక్ష్యం 165 పరుగులు
టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. భారత్ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 12(14)
వెంకటేష్ అయ్యర్ 0(0)
టిమ్ సౌతీ 4-0-40-1
శ్రేయర్ అయ్యర్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 1(4)
18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 149-3, లక్ష్యం 165 పరుగులు
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 12(14)
శ్రేయర్ అయ్యర్ 1(4)
లోకి ఫెర్గూసన్ 4-0-24-0
17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 144-3, లక్ష్యం 165 పరుగులు
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. భారత్ విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 11(10)
శ్రేయర్ అయ్యర్ 0(2)
ట్రెంట్ బౌల్ట్ 4-0-31-2
సూర్యకుమార్ యాదవ్ (బి) బౌల్ట్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు)
17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 144-3, లక్ష్యం 165 పరుగులు
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. భారత్ విజయానికి 18 బంతుల్లో 21 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 11(10)
శ్రేయర్ అయ్యర్ 0(2)
ట్రెంట్ బౌల్ట్ 4-0-31-2
సూర్యకుమార్ యాదవ్ (బి) బౌల్ట్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు)