IND vs ENG, 1st Innings Highlights: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు... టీమిండియా 364 ఆలౌట్.. అండర్సన్ ఖాతాలో 5 వికెట్లు
India vs England, 1st Innings Highlights: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ సేన(TeamIndia)364 పరుగులకే ఆలౌటైంది.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ సేన(TeamIndia)364 పరుగులకే ఆలౌటైంది. 276/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆది నుంచి తడబడుతూనే ఉంది. రెండో బంతికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత వికెట్ల పతకం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. 126.1 ఓవర్లకి 364 పరుగులకే ఆలౌటైంది.
Innings Break!
— BCCI (@BCCI) August 13, 2021
Jadeja (40) is the last one to depart as #TeamIndia are all out for 364 runs.
Scorecard - https://t.co/KGM2YEualG #ENGvIND pic.twitter.com/hOWcJNlGKu
టీమిండియా తరఫున ఓపెనర్ కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో రోజు రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేశాడు. రవీంద్ర జడేజా (40: 120 బంతుల్లో 3x4), రిషబ్ పంత్ (37: 58 బంతుల్లో 5x4)కాస్త నెమ్మదిగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రిషబ్ పంత్ ఔటైన దగ్గర నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేఎల్ రాహుల్ తర్వాత జడేజా, పంత్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో రెండు వికెట్లు, మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.
AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్
ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 127తో బ్యాటింగ్ కొనసాగించిన కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) శుక్రవారం రెండో రోజు రెండో బంతికే ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే అజింక్య రహానె (1: 23 బంతుల్లో) పెవిలియన్ బాటపట్టాడు. ఈ రోజు అతడు ఒక్క పరుగు కూడా చేయలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ కాసేపు జడేజాతో కలిసి స్కోరు బోర్డును కదిలించాడు. ఈ క్రమంలోనే భారత స్కోరు బోర్డు 300 మార్కును అందుకుంది. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి పంత్ ఔటయ్యాడు. షమి, బుమ్రా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. రహానె(1), పుజారా (9) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రోహిత్ శర్మ (83), విరాట్ కోహ్లీ(42) మంచి స్కోర్లు సాధించారు.
AlsoRead: IPL 2021: UAE బయల్దేరిన ధోనీ సేన... మొదలైన IPL సందడి... చెన్నై సూపర్ కింగ్స్ ఫొటోలు వైరల్