అన్వేషించండి
Advertisement
IND vs ENG, 1st Innings Highlights: భారత్ తొలి ఇన్నింగ్స్ 191 ఆలౌట్... శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50... క్రిస్ వోక్స్‌కి 4 వికెట్లు
India vs England, 1st Innings Highlights: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 61.3 ఓవర్లకు భారత్ 191 పరుగుల వద్ద ఆలౌటైంది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే.
India are bowled out for 191.
— ICC (@ICC) September 2, 2021
Chris Woakes finishes with a four-for.#WTC23 | #ENGvIND | https://t.co/zRhnFiKhzZ pic.twitter.com/T8eP4jp8EB
ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (57), కెప్టెన్ విరాట్ కోహ్లీ (50) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ కాస్త అయినా చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, రాబిన్ సన్ 3 వికెట్లు తీయగా, అండర్సన్, ఓవర్టన్ చెరో వికెట్ తీశారు.
Virat Kohli gets out soon after his 27th Test fifty!
— ICC (@ICC) September 2, 2021
Ollie Robinson claims his second wicket and India have lost half their side.#WTC23 | #ENGvIND | https://t.co/zRhnFj1Srx pic.twitter.com/SGLdRqmgxf
A quick 31-ball fifty for Shardul Thakur 🔥
— ICC (@ICC) September 2, 2021
What a knock he is playing!#WTC23 | #ENGvIND | https://t.co/zRhnFiKhzZ pic.twitter.com/odUam0xSDL
23వేల పరుగుల క్లబ్లో కోహ్లీ
భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 23,000 పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్‌లతో) నెం.1 స్థానంలో ఉన్నాడు. కానీ.. విరాట్ కోహ్లీ 490 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ని అందుకుని సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. కోహ్లీ, సచిన్ తర్వాత రిక్కీ పాంటింగ్ (544), జాక్వెస్ కలిస్ (551), కుమార సంగక్కర (568), రాహుల్ ద్రవిడ్ (576), మహేల జయవర్దనె (645) 23వేల పరుగుల క్లబ్లో ఉన్నారు.
23K and counting...@imVkohli | #TeamIndia pic.twitter.com/l0oVhiIYP6
— BCCI (@BCCI) September 2, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement