By: ABP Desam | Updated at : 08 Jul 2022 07:08 AM (IST)
Edited By: Ramakrishna Paladi
రోహిత్ శర్మ ( Image Source : Getty )
Rohit Sharma Records: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా 13 టీ20 విజయాలు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. సౌథాంప్టన్ వేదికగా గురువారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్ సేన నిర్దేశించిన 199 పరుగుల టార్గెట్‌ను ఆంగ్లేయులు ఛేదించలేకపోయారు. 148కే ఆలౌటయ్యారు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 29 మ్యాచులకు సారథ్యం వహించాడు. అందులో 25 గెలిస్తే కేవలం 4 మ్యాచుల్లోనే ఓటమి ఎదురైంది. విజయాల శాతం 90 వరకు ఉంది. గతంలో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినప్పుడు జట్టును హిట్‌మ్యానే నడిపించేవాడు. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆసియా కప్‌లో భారత్‌ను గెలిపించాడు. ఇప్పుడు వరుసగా 13 విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అందుకే మ్యాచ్ ముగిసిన వెంటనే 'అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 13 మ్యాచులు గెలిచిన కెప్టెన్' అంటూ రోహిత్ శర్మపై బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఇంగ్లాండ్‌పై గెలిచినందుకు రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. తొలి బంతి నుంచే అదరగొట్టామని పేర్కొన్నాడు. బ్యాటర్లంతా తమ కసిని ప్రదర్శించారని అభినందించాడు. పిచ్ చాలా బాగున్నా చెత్త షాట్లు అస్సలు ఆడలేదని గుర్తు చేశాడు. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నామని వివరించాడు. దూకుడుగా ఆడే క్రమంలో కొన్ని సార్లు వైఫల్యాలు ఎదురవుతుంటాయని చెప్పాడు. హార్దిక్ బౌలింగ్ ఆకట్టుకుందన్నాడు. భవిష్యత్తులోనూ అతడు ఇలాంటి ప్రదర్శనలే చేయాలని కోరుకున్నాడు. అతడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నాడు. కొత్త బంతి బౌలర్లు చక్కగా స్వింగ్ చేశారని ప్రశంసించాడు. మైదానంలో ఫీల్డింగ్ మరింత మెరుగవ్వాలని, క్యాచులు అందిపుచ్చుకోవాలని రోహిత్ పేర్కొన్నాడు.
🚨 Milestone Alert 🚨
First captain to win 1⃣3⃣ successive T20Is - Congratulations, @ImRo45. 👏 👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn— BCCI (@BCCI) July 7, 2022
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా 50 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఎలా సాగిందంటే
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.
అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది.
IND Vs AUS, Match Highlights: భారత్ ఖాతాలో మరో విజయం , పర్యటనను ఓటమితో ముగించిన ఆసిస్
IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?
IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్, మార్పులతో బరిలోకి భారత్
IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!
WPL 2024 auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>