అన్వేషించండి

IND vs AUS, Match Highlights: క్యాచ్‌ డ్రాప్‌లతో మ్యాచ్‌ డ్రాప్‌! లైఫ్‌లు ఇచ్చి మరీ 209 కొట్టించిన టీమ్‌ఇండియా!

IND vs AUS, Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్‌ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి.

IND vs AUS, Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్‌ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. ఫీల్డింగ్‌లో ఎన్నడూ లేనంతగా విఫమవ్వడంతో 209 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్‌ సునాయాసంగా ఛేదించేసింది. మ్యాచ్ ఫినిషర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (61; 30 బంతుల్లో 8x4, 4x6) ఓపెనింగ్‌లో అదరగొట్టాడు. ఆఖర్లో మాథ్యూవేడ్‌ (45*; 21 బంతుల్లో 6x4, 2x6) భారీ సిక్సర్లతో కంగారూలకు విజయం అందించాడు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో కేఎల్‌ రాహుల్‌ (55; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (46; 25 బంతుల్లో 2x4, 4x6), హార్దిక్‌ పాండ్య (71*; 30 బంతుల్లో 7x4, 5x6) రాణించారు.

3 లైఫులతో 'గ్రీన్‌'కు సిగ్నల్‌

మొహాలిలో ఛేదన సులభంగా ఉంటుంది! ఆసీస్‌లో సూపర్‌ బ్యాటర్లు ఉన్నారు. అయినా 209 టార్గెట్‌ కావడంతో టీమ్‌ఇండియా గెలుస్తుందని అభిమానులు నమ్మారు. క్యాచులే మ్యాచులను గెలిపిస్తాయన్న సింపుల్‌ ఫార్ములానూ మర్చిపోయిన హిట్‌మ్యాన్‌ సేన వారి నమ్మకాన్ని వమ్ము చేసింది. ఏకంగా మూడు క్యాచులను నేలపాలు చేసి మ్యాచును వదిలేసింది. భారీ టార్గెట్‌ కావడంతో ఆసీస్‌ ఎక్కడా రన్‌రేట్‌ తగ్గకుండా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (22), గ్రీన్‌ కలిసి తొలి వికెట్‌కు 39 రన్స్‌ భాగస్వామ్యం అందించారు.

ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ (35)తో కలిసిన గ్రీన్‌ జట్టు స్కోరును పవర్‌ ప్లే ముగిసే సరికి 60, 9.2 ఓవర్లకు 100కు చేర్చాడు. గ్రీన్‌కు మొత్తం 3 లైఫుల్‌ వచ్చాయి. ఒకసారి ఎల్బీ కోరలేదు. రెండు క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. ఈ క్రమంలో 2 ఓవర్ల వ్యవధిలోనే గ్రీన్‌, స్మిత్‌, మాక్సీ (1) ఔటౌనా టిమ్‌ డేవిడ్‌ (18), మాథ్యూ వేడ్‌ నిలిచారు. లెగ్‌సైడ్‌ దూకుడుగా ఆడే వేడ్‌కు టీమ్‌ఇండియా బౌలర్లు అటువైపే వేసి మరీ బౌండరీలు కొట్టించారు. 18 బంతుల్లో 40 అవసరమైన దశలో 18వ ఓవర్లో హర్షల్‌ 22 రన్స్‌ ఇవ్వడంతో మ్యాచ్‌ ఆసీస్‌ సొంతమైంది. ఆ తర్వాత డేవిడ్‌ ఔటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది. అక్షర్‌ పటేల్‌ 3, ఉమేశ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఫామ్‌లోకి కేఎల్‌!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలవకపోవడంతో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ కోసం ఎప్పట్లాగే అటాకింగ్‌ అప్రోచ్‌ను కొనసాగించింది. వికెట్లు పోయినా డిఫెన్సివ్‌గా ఆడొద్దని నిర్ణయించుకుంది. తొలి 2 ఓవర్లలో ఎక్కువ పరుగులేం రాకపోవడంతో భారీ షాట్‌ ఆడబోయిన హిట్‌మ్యాన్‌ (11) జట్టు స్కోరు 21 వద్దే ఔటయ్యాడు. వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ (2)ని లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాతో ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఇబ్బంది పెట్టాడు. ఐదో ఓవర్లో అతడు ఊహించని షాట్‌తో ఔటయ్యాడు. 35-2తో ఇబ్బందుల్లో పడ్డ టీమ్‌ను కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ ఆదుకున్నారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగారు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఆఖర్లో పాండ్య మెరుపులు!

సొగసైన సిక్సర్లు, బౌండరీలతో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కేఎల్‌ను జట్టు స్కోరు 103 వద్ద హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే అర్ధశతకానికి చేరువైన సూర్యను గ్రీన్‌ పెవిలియన్‌కు పంపించాడు. మధ్యలో అక్షర్‌ పటేల్‌ (6), దినేశ్‌ కార్తీక్‌ (6) ఎక్కువ పరుగులేం చేయలేదు. వాళ్లు త్వరగా ఔటైనా హార్దిక్‌ పాండ్య మాత్రం మైదానంలో కుంగ్‌ఫూ చేశాడు. ఆత్మవిశ్వాసంతో మంచి ఈజ్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ జరిగి మరీ సిక్సర్లు బాదేశాడు. ఫ్రీ హ్యాండ్స్‌తో షాట్లు కొట్టాడు. 25 బంతుల్లోనే టీ20ల్లో రెండో అర్ధశతకం అందుకున్నాడు. ఆఖరి ఓవర్‌ మూడు బంతుల్ని హ్యాట్రిక్‌ సిక్సర్లుగా మలిచి జట్టు స్కోరును 208-6కు చేర్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget