(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG, T20 LIVE: 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 144-7, 66 పరుగులతో భారత్ విజయం
T20 WC 2021, Match 33, IND vs AFG: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేటి సూపర్ 12 మ్యాచ్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.
LIVE
Background
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12లో టీమ్‌ఇండియా ప్రమాదకర అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు వరుస ఓటములతో దిగాలు పడిన కోహ్లీసేనకు ఈ పోరులో విజయం అత్యంత కీలకం. అఫ్గానిస్థాన్, భారత్ ఇప్పటి వరకు రెండుసార్లే టీ20ల్లో తలపడ్డాయి. రెండుసార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఇక ఈ ప్రపంచకప్‌లో కోహ్లీసేన ఫామ్ ఏమంత బాగాలేదు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేసిన పాక్, న్యూజిలాండ్ విజయాలు అందుకున్నాయి. అఫ్గాన్ మాత్రం మూడు మ్యాచులాడి రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ అబుదాబిలో జరగనుంది. ఇక్కడ కూడా టాసే కీలకం. ఈ వేదికలో పది మ్యాచులు జరిగితే ఏడింట్లో ఛేజ్ చేసిన జట్లే గెలవడం గమనార్హం. మిగతా మూడు జట్లు తొలుత బ్యాటింగ్ చేసినా గెలవడానికి కారణం అవి నమీబియా, ఐర్లాండ్‌పై ఆడటమే! అబుదాబి పిచ్ కూడా దుబాయ్ తరహాలోనే ప్రవర్తిస్తోంది. మొదట బ్యాటింగ్‌కు అస్సలు అనుకూలించడం లేదు. మంగళవారం పాక్‌ను తొలి పది ఓవర్ల వరకు నమీబియా బంతితో వణికించింది!
టీమ్‌ఇండియాఓటమి భారంతో కనిపిస్తోంది. ఆటగాళ్లలో ఉత్తేజం, పట్టుదల కనిపించడం లేదు. బహుశా ఈ మ్యాచులో రోహిత్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తారు. ఇషాన్ రావడంతో మరి రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తారా అన్న సందేహాలూ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇంకా కోలుకోలేదు. హార్దిక్ పాండ్య భారంగా మారుతున్నాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ రాణించాలి. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు తన మ్యాజిక్ చూపించలేదు. బహుశా అతడి స్థానంలో రాహుల్ చాహర్‌ను తీసుకోవచ్చు. రవీంద్ర జడేజా సైతం బంతితో రాణించడం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే సత్తా చాటుతున్నాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ రాణించాల్సిన అవసరం ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
అఫ్గాన్‌కు యూఏఈలో తిరుగులేని రికార్డు ఉంది. మొన్న పాక్ చేతిలో తప్ప ఎన్నడూ అక్కడ ఓటమి చవిచూడలేదు. లెగ్ స్పిన్నర్ రషీద్ అత్యంత కీలకం అవుతాడు. అయితే రషీద్ బౌలింగ్‌ను ఇషాన్ చితకబాదగలడు. మహ్మద్ నబీ కెప్టెన్‌గా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జజాయ్, షెహజాద్ బ్యాటింగ్ చేయడం వారికి అత్యవసరం. అఫ్గాన్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లే ఉండటంతో ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేయగలరు. ఒకవేళ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు అగ్ని పరీక్ష పెట్టగలరు! ఏదేమైనా అఫ్గాన్‌ను తక్కువగా తీసుకుంటే కోహ్లీసేనకు ఇబ్బంది తప్పదు!
20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 144-7, 66 పరుగులతో భారత్ విజయం
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. భారత్ 66 పరుగులతో విజయం సాధించింది.
కరీం జనత్ 42(22)
షరాఫుద్దీన్ 2(3)
హార్దిక్ పాండ్యా 2-0-23-0
19 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 130-7, లక్ష్యం 211 పరుగులు
షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. నబీ, రషీద్ ఖాన్ అవుటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 6 బంతుల్లో 81 పరుగులు కావాలి.
కరీం జనత్ 30(18)
షరాఫుద్దీన్ 0(1)
షమీ 4-0-32-3
నబీ (సి) జడేజా (బి) షమీ (35: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)
రషీద్ ఖాన్ (సి) పాండ్యా (బి) షమీ (0: 1 బంతి)
18 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 125-5, లక్ష్యం 211 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 12 బంతుల్లో 86 పరుగులు కావాలి.
కరీం జనత్ 26(15)
నబీ 35(31)
శార్దూల్ ఠాకూర్ 3-0-31-0
17 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 109-5, లక్ష్యం 211 పరుగులు
బుమ్రా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 18 బంతుల్లో 102 పరుగులు కావాలి.
కరీం జనత్ 23(13)
నబీ 22(27)
బుమ్రా 4-0-25-1
16 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 98-5, లక్ష్యం 211 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 24 బంతుల్లో 113 పరుగులు కావాలి.
కరీం జనత్ 22(12)
నబీ 18(23)
శార్దూల్ ఠాకూర్ 2-0-15-0