అన్వేషించండి

ICC World Cup 2023: కోహ్లీ క్యాచ్‌ మార్ష్‌ పట్టుంటే..? ఊపిరిబిగపట్టి చూసిన క్రికెట్‌ ప్రేమికులు

ODI World Cup 2023: హేజిల్‌వుడ్‌ ఎనిమిదో ఓవర్‌ లో ఫుల్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. బంతి గాల్లో లేచింది. అంతే అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.

అది భారత్‌ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయం. ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న సమయం. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. ప్రతీ బంతి వారి సహనాన్ని పరీక్షిస్తోంది. చిన్నగా భారత్‌ స్కోరు రెండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి ఎనిమిది ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసిన స్థితికి చేరింది. భారత్‌ ఓటమి బారి నుంచి ఇంకా బయట పడలేదు. ఇంకో వికెట్‌ పడితే చాలు... ఇండియా మిగిలిన బ్యాటర్ల పని పట్టడం ఆస్ట్రేలియాకు పెద్ద పనికాదు. ఆ సమయంలో అందివచ్చిన అవకాశాన్ని మిచెల్‌ మార్ష్‌ జారవిడవడంతో జీవనదానం పొందిన కోహ్లీ.... 85 పరుగులతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.


హేజిల్‌వుడ్‌ ఎనిమిదో ఓవర్‌ వేసేందుకు బంతి తీసుకున్నాడు. అప్పటికే చాలాసేపు ఓపికగా చూసిన కోహ్లీకి సహనం నశించింది. ఆస్ట్రేలియా బౌలర్ల లయను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో హేజిల్‌వుడ్‌ వేసిన బంతిని ఫుల్ చేశాడు. బంతి గాల్లో లేచింది. అంతే కోట్లాది మంది అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మిచెల్‌ మార్ష్‌ బంతిని అందుకునేందుకు ముందుకు పరిగెత్తాడు. బంతిని దాదాపుగా అందుకునేంత పనిచేసిన మార్ష్‌... తడబాటుతో క్యాచ్‌ను జారవిడిచాడు. అంతే ఈ జీవనదానంతో మరింత జాగ్రత్తగా ఆడిన కోహ్లీ టీమిండియాకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. మార్ష్‌ క్యాచ్‌ జారవిడిచినప్పుడు కోహ్లీ స్కోరు కేవలం పన్నెండు పరుగులు మాత్రమే. తర్వాత మరో 73 పరుగులు చేసిన విరాట్‌... కంగారు బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే ఈ క్యాచ్‌ గాల్లోకి లేచినప్పుడు తన పరిస్థితి గురించి టీమిండియా స్టార్‌ స్పిన్నర్ అశ్విన్‌ వివరించాడు.


 " విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడ బంతి గాల్లోకి లేవగానే నాకేమీ అర్థం కాలేదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాను. కోహ్లీ క్యాచ్‌ను మార్ష్‌ తప్పక అందుకుంటాడని భావించాను. అందుకే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాను. కోహ్లీ బంతిని గాల్లోకి లేపడం చూసి నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మ్యాచ్‌ అంతా నన్ను పిలవాలని సహచరులకు చెప్పాను. మ్యాచ్‌ ముగిసేంత వరకు తాను ఎక్కడైతే నిలబడ్డానో అలాగే ఉన్నాను. కదిలితే మరో వికెట్‌ పడుతుందని నా నమ్మకం. అందుకే మ్యాచ్‌ ముగిసే వరకు అక్కడి నుంచి కదల్లేదు. ఇప్పుడు నా పాదాలు బాగా నొప్పిగా ఉన్నాయి" అని అశ్విన్‌ వివరించాడు. 


 అస్ట్రేలియాతో మ్యాచ్‌ ఎప్పూడూ చాలా కఠినంగానే ఉంటుందన్న అశ్విన్‌.. ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లలో వారిని తొలి మ్యాచ్‌లోనే ఓడించడం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని అన్నాడు. ఆస్ట్రేలియాను 199 పరుగులకే కుప్పకూల్చడం అంత తేలికైన విషయం కాదని అశ్విన్‌ అన్నాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో గెలిచి టీమిండియా వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Embed widget