ICC Women World Cup 2022: ఆరు నెలల పాపతో మైదానంలోకి - మనసులు గెలుచుకున్న పాక్ మహిళల జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్
భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ ముగిశాక పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఆరు నెలల కూతురితో భారత క్రికెటర్లు తీసుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఆరు నెలల కూతురితో కనిపించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు ఫ్యాన్స్ నుంచే కాకుండా క్రికెట్ ప్రేమికుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. భారత క్రికెటర్లు ఈ పాపతో తీసుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ ఈ ఫొటోలకు కామెంట్లు చేస్తున్నారు.
This video ..
— Dhruba Jyot Nath Ⓥ🇮🇳 (@Dhrubayogi) March 6, 2022
🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW
View this post on Instagram
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్ (67: 59 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... స్నేహ్ రాణా (53 నాటౌట్: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు), స్మృతి మంథన (52: 75 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు. అనంతరం పాకిస్తాన్ 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. పూజా వస్త్రాకర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Little Fatima's first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22
— ICC (@ICC) March 6, 2022
📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H