News
News
X

AFG vs NAM Highlights: నమీబియా చిత్తు.. 62 తేడాతో అఫ్గాన్‌ రెండో విజయం

గ్రూప్‌ 2లో పాక్‌ తర్వాత రెండో విజయం అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. అఫ్గాన్‌ 62 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది.

FOLLOW US: 

అనుకున్నదే జరిగింది! నమీబియాను అఫ్గానిస్థాన్‌ చిత్తుగా ఓడించింది. తమ బౌలింగ్‌కు తిరుగులేదని చాటిచెప్పింది. గ్రూప్‌ 2లో పాక్‌ తర్వాత రెండో విజయం అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మొదట మహ్మద్‌ షెహజాద్‌ (45; 33 బంతుల్లో 3x4, 2x6), మహ్మద్ నబీ (32*; 17 బంతుల్లో 5x4, 1x6) అదరగొట్టడంతో అఫ్గాన్‌ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నమీబియాలో డేవిడ్‌ వైస్‌ (26; 30 బంతుల్లో 2x4) ఒక్కడే రాణించాడు. నవీనుల్‌ హక్‌ (3), హమీద్‌ హసన్‌ (3), గుల్బదీన్‌ నయీమ్‌ (2) బౌలింగ్‌లో అదరగొట్టడంతో నమీబియా 20 ఓవర్లకు 98/9కి పరిమితం అయింది. అఫ్గాన్‌ 62 పరుగుల తేడాతో గెలిచింది.

దంచేశారు
మొదట అఫ్గాన్‌ సునాయాసంగా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (33; 27 బంతుల్లో 4x4, 2x6), షెజాద్‌ దంచికొట్టడంతో పవర్‌ప్లేలో 50 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. 6.4వ బంతికి హజ్రతుల్లాను స్మిత్ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే రహ్మతుల్లా గుర్జా్‌బ్‌ (4) పెవిలియన్‌ చేరాడు. దాంతో అస్ఘర్‌ అఫ్గాన్‌ (31; 23 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి షెజాద్‌ దుమ్మురేపాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 12.4వ బంతికి షెజాద్‌ను ట్రంపెల్‌మన్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే నజీబుల్లా జర్దాన్‌ (7) పెవిలియన్‌ చేరాడు. కీలక సమయంలో  అస్ఘర్‌తో కలిసి నబీ చితక్కొట్టాడు. అతడు ఏకంగా ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశాడు. జట్టు స్కోరు 148 వద్ద అస్ఘర్‌ను ట్రంపెల్‌మన్‌ ఔట్‌ చేసినా నబీ అఫ్గాన్‌ స్కోరును 160కి చేర్చాడు.

Also Read: T20 Worldcup 2021: విజయం కావాలా నాయనా.. ముందు ఇక్కడ గెలవాల్సిందే!

Also Read: AFG vs PAK, Match Highlights: పాకిస్తాన్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం

Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!

Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 31 Oct 2021 07:09 PM (IST) Tags: ICC afghanistan T20 World Cup 2021 T20 WC 2021 Sheikh Zayed Stadium ICC Men's T20 WC AFG vs NAM Namibia afghanistan vs namibia

సంబంధిత కథనాలు

Ajinkya Rahane Becomes Father:  మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్

Ajinkya Rahane Becomes Father: మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్

ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: రిలీ రొసో సెంచరీ అదరహో..! టీమ్‌ఇండియా టార్గెట్‌ 228

IND vs SA 3rd T20: రిలీ రొసో సెంచరీ అదరహో..! టీమ్‌ఇండియా టార్గెట్‌ 228

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్